ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు వచ్చేస్తాయనే సమయంలో పవన్ కళ్యాణ్ ఓ స్పీచ్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తుందని.. కావాలనే టార్గెట్ చేస్తుందని మాటల తూటాలు విసిరారు. ఈ విషయం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత పోసాని కృష్ణమురళి రియాక్ట్ అవుతూ ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్ పెట్టి పవన్ ని టార్గెట్ చేశారు. ఇదంతా జరుగుతుండడంతో ఇప్పట్లో టాలీవుడ్ కష్టాలు తీరవనే అనుమానాలు మొదలయ్యాయి.
ఇంతలో పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగడంతో టికెట్ రేట్ల వ్యవహారం పక్కకు వెళ్లిపోతుందేమోనని భయపడ్డారు. అందుకే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోన్ కోసం టాలీవుడ్ నిర్మాతలు కొందరు ఆంధ్రాకు బయలుదేరారు. మంత్రి పేర్ని నాని అపాయింట్ మెంట్ కోరి మరీ తీసుకున్నారు. ఇప్పటికే కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆన్‌లైన్ పద్ధతిలో సినిమా టికెట్ల విక్రయాలపై టాలీవుడ్ నిర్మాతల బృందంతో చర్చించారు.
ఇప్పుడు మరోసారి మంత్రితో మీటింగ్ కు భేటీ అయ్యారు టాలీవుడ్ నిర్మాతలు. మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగిన సమావేశానికి నిర్మాత దిల్ రాజు, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఏదోక విధంగా మంత్రిని కన్విన్స్ చేసుకొని టికెట్ రేట్లు పెంచుకోవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తున్న సమయంలో దిల్ రాజు పడిపడి నవ్వారు. ఈ విషయం వైకాపా అధిష్టానం వరకు వెళ్లిందని టాక్. మరి ఇప్పుడు పేర్ని నాని.. దిల్ రాజు, ఇతర నిర్మాతల రిక్వెస్ట్ లను కన్సిడర్ చేస్తారో లేదో చూడాలి!
Also Read: పట్టుచీర, మల్లెపూలు...పుష్పలో రష్మిక ఫస్ట్ లుక్ అదిరిపోలా..!
Also Read: నా శ్వాస ఉన్నంత వరకూ మీరే నా దైవం..బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Also Read: సామాజిక సేవలో సోనూ మరో అడుగు..శబ్దం, వాసన, రుచిని ఇకపై చక్కగా ఆస్వాదిద్దాం అన్న రియల్ హీరో