భారతీయ రైల్వేలో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. రైల్వే శాఖకు చెందిన వేర్వేర్లు జోన్లు ఇటీవల పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. తాజాగా వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) సైతం పలు ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంస్థలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,226 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నిన్నటి (అక్టోబర్ 11) నుంచి ప్రారంభం కాగా.. గడువు నవంబర్ 10వ తేదీతో ముగియనుంది. వీటిలో వెల్డర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ తదితర పోస్టులు ఉన్నాయి.

పోస్టును బట్టి విద్యార్హత మారుతోంది. పదో తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అవ్వాలి. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా వారు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Also Read: టెన్త్ విద్యార్హ‌త‌తో ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే.. 

విభాగాల వారీగా ఖాళీలు.. 

విభాగంఖాళీల సంఖ్య 
 ఫిట్టర్ 491
ఎలక్ట్రీషియన్478
పెయింటర్165
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్155
వెల్డర్147
మేసన్86
డీజిల్ మెకానిక్77
బ్లాక్‌స్మిత్74
వైర్‌మ్యాన్67
ప్లంబర్66
కార్పెంటర్60
ఎలక్ట్రానిక్స్ మెకానిక్60
మెషినిస్ట్37
స్టెనోగ్రాఫర్ (హిందీ)28
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)23
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్20
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)14
టర్నర్12
ఏసీ మెకానిక్9
సర్వేయర్9
హౌజ్ కీపర్7
హార్టికల్చర్ అసిస్టెంట్5
మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్యూప్‌మెంట్ మెకానిక్ కమ్ ఆపరేటర్5
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్5
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (కుకింగ్)5
స్యూయింగ్ టెక్నాలజీ5
ఇండస్ట్రియల్ పెయింటర్5
మెకానిక్ (మోటార్ వెహికిల్)4
మెకానిక్ (ట్రాక్టర్)4
గార్డెనర్4
ఫ్లోరిస్ట్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్4
కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్4
సెక్రెటేరియల్ అసిస్టెంట్4
కేబుల్ జాయింటర్3
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (జనరల్)2
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (వెజిటేరియన్)2
హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్2
డెంటల్ లేబరేటరీ టెక్నీషియన్2
హోటల్ క్లర్క్ / రిసెప్షనిస్ట్1
డిజిటల్ ఫోటోగ్రాఫర్1
అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్1
 క్రెచ్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్1
 డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)  1

Also Read: డీఆర్డీఓ హైద‌రాబాద్‌లో జాబ్స్.. రూ.54,000 వరకు జీతం.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

Also Read: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి