ఈ మధ్యకాలంలో స్మార్ట్ ట్యాబ్లెట్లకు డిమాండ్ బాగా పెరిగింది. దీని స్క్రీన్ మొబైల్ డిస్‌ప్లే కంటే పెద్దగా ఉంటుంది. ల్యాప్‌టాప్ కంటే సులభంగా దీన్ని ఉపయోగించవచ్చు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఆన్‌లైన్ క్లాసులు వినడానికి, లేదా గేమ్స్ ఆడుకోవడానికి మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. అయితే అమెజాన్ నవరాత్రి సేల్‌లో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి..


అమెజాన్ నవరాత్రి ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


1. లెనోవో ట్యాబ్ ఎం10 హెచ్‌డీ సెకండ్ జెన్
ఈ ట్యాబ్లెట్ 40 శాతం తక్కువ ధరకే అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.25,000 కాగా, ఈ సేల్‌లో రూ.13,999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉండనుంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని స్క్రీన్ సైజు 10.1 అంగుళాలు కాగా, హెచ్‌డీ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, మీడియాటెక్ హీలియో పీ22టీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


లెనోవో ట్యాబ్ ఎం10 హెచ్‌డీ సెకండ్ జెన్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


2. శాంసంగ్ ట్యాబ్ ఏ7 వైఫై
శాంసంగ్ ట్యాబ్లెట్లపై కూడా ఈ సేల్‌లో భారీ తగ్గింపును అందించారు. దీని అసలు ధర రూ.20,999 కాగా, ఈ సేల్‌లో రూ.15,999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 10.4 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. క్వాడ్ స్టీరియో సౌండ్ కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 7040 ఎంఏహెచ్ బ్యాటరీగా ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వెనకవైపు 8 మెగాపిక్సెల్, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


శాంసంగ్ ట్యాబ్ ఏ7 వైఫై కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


3. రియల్‌మీ ప్యాడ్
దీనిపై కూడా ఈ సేల్‌లో భారీ తగ్గింపును అందించారు. ఈ ట్యాబ్లెట్ అసలు ధర రూ.29,999 కాగా, ఈ సేల్‌లో రూ.18,949కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో 10.4 అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ+ డిస్‌ప్లేను అందించారు. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 7100 ఎంఏహెచ్‌గా ఉంది.


రియల్‌మీ ప్యాడ్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


4. ఐకాల్ ఎన్18 కాలింగ్ ట్యాబ్లెట్
రూ.10 వేలలోపే మంచి ట్యాబ్లెట్ కావాలనుకుంటే ఈ ట్యాబ్లెట్ మంచి ఆప్షన్. ఈ ట్యాబ్లెట్ అసలు ధర రూ.11,999 కాగా, రూ.9,699కే ఈ ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇందులో డ్యూయల్ సిమ్ ఆప్షన్ కూడా ఉంది. వెనకవైపు 8 మెగాపిక్సెల్, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


ఐకాల్ ఎన్18 కాలింగ్ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


5. ఫ్యూజన్5 4జీ ట్యాబ్లెట్
ఈ ట్యాబ్లెట్‌పై ఏకంగా 50 శాతం తగ్గింపును అందించారు. దీని అసలు ధర రూ.19,999 కాగా, ఈ సేల్‌లో రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు. ఇది ఒక కాలింగ్ ట్యాబ్లెట్. ఆండ్రాయిడ్ 105డీ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. రెండు సిమ్ కార్డులు ఇందులో ఉన్నాయి. క్వాడ్‌కోర్ ఏ53 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. జీపీఎల్ కూడా ఇందులో ఉంది.


ఫ్యూజన్5 4జీ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి