నిరుద్యోగులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,775 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఇంటర్ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 25తో ముగియనుంది. ఫీజు చెల్లింపునకు గడువు అక్టోబర్ 28 రాత్రి 11.30 వరకు ఉంది. బ్యాంక్ చలాన్ రూపంలో ఫీజు చెల్లించేందుకు నవంబర్ 1వ తేదీ వరకు గడువు ఉన్నట్లు సంస్థ తెలిపింది. రాత పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక పరీక్ష తేదీలను విడుదల చేస్తారు. మరిన్ని వివరాల కోసం ఎస్ఎస్‌సీ అధికారిక వెబ్ సైట్ ssc.nic.inను సంప్రదించవచ్చు.
Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..
వయోపరిమితి, విద్యార్హత..
పోస్టుల ఆధారంగా వయోపరిమితి, విద్యార్హత వివరాలు మారుతున్నాయి. కొన్ని పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణత అవసరం. మరికొన్నింటికి 12వ తరగతి (ఇంటర్) విద్యార్హత ఉండాలి. గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో కూడా పలు ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ (దివ్యాంగ), ఎక్స్ సర్వీస్‌మెన్ (ఈఎస్ఎం) కేటగిరీల అభ్యర్థులు, మహిళలకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు. మిగతా వారు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అభ్యర్థుల ఎంపిక విధానం..
అభ్యర్థులకు మొదట కంప్యూటర్ బెస్డ్ (CBT) పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష వ్యవధి 60 నిమిషాలుగా ఉంది. ఆబ్జెక్టివ్ విధానంలో (Objective type) ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతీ తప్పు ప్రశ్నకు 0.50 (1/2) మార్కుల కోత విధిస్తారు. అయితే పోస్టు, విద్యార్హత ఆధారంగా 3 పరీక్షల వరకు నిర్వహించే అవకాశం ఉంది. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి నైపుణ్య (Skill) పరీక్ష ఉంటుంది.
Also Read: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
పరీక్ష విధానం..
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
జనరల్ ఇంటెలిజన్స్ | 25 | 50 |
జనరల్ అవేర్‌నెస్ | 25 | 50 |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 25 | 50 |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 25 | 50 |
Also Read: టీచర్ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా దరఖాస్తు చేసుకోండి