ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడే అల్పపీడనం క్రమంగా ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తుందని, ఒడిశా తీరం వైపు కదులుతుందని చెబుతున్నారు. దీని ప్రభావం ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్రపైనా పడుతుందని చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ కారణంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి తదుపరి 24 గంటల్లో ఒడిశా–కోస్తాంధ్ర తీరం చేరుకునే అవకాశముంది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పొడి వాతావరణమే ఉంటుందని అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో అండమాన్ దీవుల పరిసర ప్రాంతాల్లో గాలులతో ఉపరితల ఆవర్తనం కదులుతుంది. దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశల్లో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ
రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది జూన్ 5న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు అత్యంత చురుకుగా కదిలాయి. దీంతో సాధారణ వర్షపాతం కంటే 38 శాతం అధికంగా నమోదు కావడం గమనార్హం. ఈ నెల 6న మొదలైన నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ఈ నెల 12 నాటికి దాదాపు పూర్తయిందని వాతావరణ శాఖ వెల్లడించింది, గతేడాది(అక్టోబర్ 28)తో పోలిస్తే 16 రోజుల ముందే రుతుపవనాల విరమణ జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Also read: శునకాలు మరణాన్ని ముందే పసిగడతాయా? వాటి అరుపులతో ఆ విషయాన్ని మనకు తెలియజేస్తాయా?
Also read: ఈ అలవాట్లు మానుకోండి... లేకుంటే కిడ్నీలకు ప్రమాదం తప్పదు