కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఓ మహిళ నిద్రపోతుంది. సడెన్ గా ఆమె పక్కనే ఓ రాయి పడింది. అది ఆకాశంలో నుంచి వచ్చి.. పడింది. ఇంటికి కన్నం చేసుకూని మరీ.. దూసుకొచ్చింది. ఈ ఘటనతో ఉలిక్కిపడి లేచిన మహిళ వెంటనే పోలీసులకు కాల్ చేసింది.  అసలు ఆ రాత్రి ఏం జరిగింది.

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో రూత్ హామిల్టన్ అనే మహిళ తన ఇంట్లో నిద్రిస్తుంది. ఆకాశం నుంచి ఏదో పడి.. ఇంటికి కన్నం పడి.. దిండు పక్కన పడింది. పక్కనే ఉన్నా.. పేపర్ల లాంటి వస్తువులు తన మెుకంపై పడ్డాయి. ఉలిక్కి పడి లేచింది హామిల్టన్. అసలు ఏం జరుగుతుందో గుర్తించలేకపోయింది. లేచి లైట్ ఆన్ చేసింది. వెంటనే 911 కి డయల్ చేసిందని, ఒక పోలీసు అధికారిని సంఘటనా స్థలానికి వచ్చారు. వచ్చిన పోలీసు అధికారి పరిశీలించి.. పక్కనే నిర్మాణం జరుగుతన్న ప్రదేశం నుంచి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. వారు ఏదైనా బ్లాస్టింగ్ చేస్తున్నారేమోననే అనుమానంతో అక్కడికి వెళ్లి చూశారు. కానీ అక్కడి వాళ్లు అలాంటిది ఏమీ లేదని.. చెప్పారు. కానీ ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతిని చూశామని చెప్పారు.

అది అరుదైన అంతరిక్ష రాయి. పై నుంచి పడినట్టు తెలుసుకున్నారు. అలాంటి రాయి అందరి దగ్గరా ఉండదు. అయినా ఆమె బాగా భయపడింది. కానీ అది ఆకాశం నుంచి పడిన ఉల్క. అక్కడ అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయని చెబుతారు.

'ఘటన జరగగానే నేను భయపడ్డాను. ఎవరైనా దూకారని అనుకున్నాను. లేకుంటేతుపాకీతో కాల్పులు జరిపారని అనుకున్నాను. ఆకాశం నుంచి పడిందని తెలుసుకున్నాక కాస్త ఉపశమనం కలిగిందని..' హామిల్టన్ చెప్పారు.

ఆ రాయిని గుర్తుగా దాచుకుంది హామిల్టన్. గతేడాది ఇండొనేసియాలోని ఉత్తర సుమత్రాలో జోషువా హుటాగాలంగ్ ఇంటి రూఫ్‌పై ఓ ఉల్క పడింది. అది ఏకంగా 2.1 కేజీల బరువుంది. అది అరుదైనది కావడంతో వేలంలో రూ.13 కోట్లకు అమ్ముడైంది. ప్రస్తుతం హామిల్టన్ దగ్గర ఉన్న ఉల్కను CM1/2 కార్బొనేషియస్ ఖోన్‌డ్రైట్ రకంగా గుర్తించారు.  ఒక్కో గ్రాము ధర రూ.64వేలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read: Afghan Terrorist Attack: అఫ్గాన్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్.. పోరాటం కొనసాగుతుందంటూ వారికి భరోసా

Also Read: Pornhub Traffic Surged: ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ పని చేయట్లేదని.. ఆ సైట్స్ మీద ఎగబడ్డారుగా యూజర్లు

Also Read: Attack At Saudi Airport : సౌదీ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు.. హైతీ తిరుగుబాటు దారుల పనేనని అనుమానం !

Also Read: World Post Day 2021: ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్‌బుక్.. అప్పట్లో ఆల్ ఇన్ వన్ అయిన పోస్ట్ కార్డ్స్ గురించి ఈ విషయాలు తెలుసా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి