సౌదీ అరేబియాలోని జిజాన్ పట్టణంలోని కింగ్ అబ్దుల్లా ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పది మందికిపైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని సౌదీ అధికారిక వార్తా సంస్థ ధృవీకరించింది. గాయపడిన వారిలో ఆరుగురు సౌదీ పౌరులు, ముగ్గురు బంగ్లాదేశీ పౌరులు, ఒక సూడాన్ వ్యక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ డ్రోన్ దాడికి తామే కారణం అని ఎవరూ ప్రకటించుకోలేదు. అయితే సౌదీ అరేబియాను హైతీ తిరుగుబాటుదారులు కొంత కాలంగా టార్గెట్ చేశారు. డ్రోన్ దాడులు చేస్తున్నారు. 






Also Read : మళ్లీ ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. ఇంతకీ ఏమైనట్టు?


గత ఏప్రిల్‌లోనూ యెమెన్‌కు చెందిన హైతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకున్నారు. ఏప్రిల్‌లో కూడా ప్రస్తుతం దాడులు జరిగిన జిజైన్ ఎయిర్ పోర్ట్, కింగ్ ఖలీద్ ఎయిర్ బేస్‌లపై డ్రోన్లతో దాడి చేశారు. దీంతో రెండు ప్రదేశాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పట్లో హైతీ తిరుగుబాటుదారుల డ్రోన్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఇప్పుడు మరోసారి అక్కడే డ్రోన్ దాడులకు తెగబడ్డారు. 


Also Read : ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ ... అర్బాజ్‌ఖాన్‌, మూన్‌మన్‌ ధమేచ బెయిల్ కూడా నిరాకరణ..


హైతీ తిరుగుబాటుదారులు   డ్రోన్లు, క్షిపణి దాడులు చేయడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై సౌదీ అరేబియాకు స్పష్టమైన సమచారా ంఉంది. సౌదీ అరేబియాకు నైరుతి దిశలో ఉన్న రెండు నగరాలైన జిజైన్, ఖామిస్ మిషాయత్లను హైతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు.  ఈ రెండు నగరాలు నిరంతరం డ్రోన్, క్షిపణి దాడులను ఎదుర్కొంటున్నాయి. 


Also Read : హత్య కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు


2014 నుంచి యెమెన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతున్న‌ది. సౌదీ అరేబియా కూడా 2015 నుంచి ఈ యుద్ధంలో పాల్గొంటున్నది. అక్కడి ప్రభుత్వానికి మద్దతు ఇఇస్తోంది. అందుకే సౌదీ అరేబియా సరిహద్దు ప్రాంతాలను హైతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు. హైతీలు ఇటీవల సౌదీ నగరాలు, చమురు సౌకర్యాలపై సరిహద్దు క్షిపణి, డ్రోన్ దాడులను వేగవంతం చేశారు. ఇరాన్ మద్దతుతో  హైతీలు అనేక ఉత్తర యెమెన్ ప్రావిన్సులను స్వాధీనం చేసుకున్నారు.  2015 మార్చిలో యెమెన్ వివాదంలో సౌదీ నేతృత్వంలోని అరబ్ సంకీర్ణం జోక్యం చేసుకోవ‌డ‌మే ఈ దాడుల‌కు ప్రధాన కార‌ణం.


Also Read : "గాంధీ"లను బీజేపీ వదిలించుకుంటోందా ? జాతీయ కార్యవర్గం నుంచి ఎందుకు తొలగించారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి