బాలీవుడ్‌ టాప్ హీరో షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కు ముంబయి కోర్టు బెయిల్ నిరాకరించింది. క్రూజ్‌ నౌకలో రేవ్ పార్టీలో డ్రగ్స్‌ వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ కు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. డ్రగ్స్‌ వ్యవహారంలో ఎన్సీబీ ఇటీవల ఆర్యన్ ను అరెస్టు చేసింది. ఆర్యన్‌తో పాటు ఎనిమిది మందికి గురువారం కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అయితే ఆర్యన్‌ తరఫు న్యాయవాది మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు ఇవాళ నిర్ణయాన్ని ప్రకటించింది. వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ఖాన్‌, మూన్‌మన్‌ ధమేచలకు బెయిల్‌ తిరస్కరించారు. వీరు బెయిల్‌ కోసం  సెషన్స్‌ కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. 






Also Read: ముంబయి రేవ్ పార్టీ కేసు.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆర్యన్ ఖాన్


అర్బాజ్ ఖాన్ బెయిల్ పై రేపు పిటిషన్!


ఆర్యన్‌కు బెయిల్‌ నిరాకరించాలని ఎన్సీబీ తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ కోర్టును కోరారు. బెయిల్‌పై విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం ఉంటుందని ఆయన కోర్టుకు తెలిపారు. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందన్నారు. అర్బాజ్‌ఖాన్‌ న్యాయవాది బెయిల్‌ కోసం శనివారం సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ వేయనున్నట్టు తెలుస్తోంది. బెయిల్‌ పిటిషన్‌పై వాదనల సందర్భంగా మూన్‌మూన్‌ ధమేచ న్యాయవాది మాట్లాడారు. మూన్‌మన్‌ మధ్యప్రదేశ్‌కు చెందినవారని ఆమెను ముంబయికి ఆహ్వానించడం వల్లే ఇక్కడికి వచ్చారని కోర్టుకు తెలిపారు. ఆమెకు వ్యతిరేకంగా ఎన్సీబీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. 


Also Watch: ఎవరీ ఆర్యన్ ఖాన్.. మార్షల్ ఆర్ట్స్ నుంచి డ్రగ్స్ కేసు వరకు.. స్టార్ కిడ్ ఆసక్తికర విషయాలు


Also Read: అవును.. నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాను: ఆర్యన్ ఖాన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి