Aryan Khan Drug Case: అవును.. నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాను: ఆర్యన్ ఖాన్

డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ విచారించింది. ఈ విచారణలో తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆర్యన్ చెప్పినట్లు సమాచారం.

Continues below advertisement

డ్రగ్స్‌ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌తోపాటు మొత్తం 8 మందిని ఎన్‌సీబీ అధికారులు నిన్న అరెస్ట్ చేసి విచారించారు. అయితే కస్టడీలో ఆర్యన్‌ ఖాన్‌ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.

Continues below advertisement

తాను నాలుగేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఆర్యన్‌..  ఎన్‌సీబీకి తెలిపినట్లు సమాచారం. అతను యూకే, దుబాయ్‌, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడట.

అయితే అంతకుముందు షారుక్‌ ఖాన్‌ కస్టడీలో ఉన్న తన కుమారుడితో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో అతను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నట్లు సమాచారం. కాగా ఆర్యన్‌ ఎన్‌సీబీ కస్టడీ నేటితో ముగియనుంది. 

రేవ్ పార్టీ..

సముద్రంలో ఉన్న కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. 

ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు. ఈరోజుతో ఆర్యన్ ఖాన్ ఎన్‌సీబీ కస్టడీ ముగియనుంది.

Also Read: Manchu Vishnu: కృష్ణం రాజుతో విష్ణు భేటీ.. మంచు ట్వీట్‌పై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం

Also Read: MAA Elections: టాలీవుడ్‌లో ప్రాంతీయవాదం రెచ్చగొడతారా?.. హీరో శ్రీకాంత్ ఆగ్రహం

Also Read:Pandora Papers: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా లీక్.. బడాబాబుల ‘విదేశీ’ గుట్టురట్టు.. భారతీయ ప్రముఖులు కూడా!

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 20,799 కేసులు నమోదు.. గత 200 రోజుల్లో ఇవే అత్యల్పం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Continues below advertisement