మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా గెలుపుకోసం అభ్యర్థులు శ్రమిస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ సభ్యులకు లంచ్ పార్టీ ఇచ్చి మరీ తన ప్యానెల్ కోసం ప్రచారం చేసుకున్నారు. విష్ణు ప్యానెల్‌, సీనియర్ నటుడు నరేష్‌ల ఆరోపణలపై మండిపడ్డారు. అయితే, విష్ణు మాత్రం.. సైలెంట్‌గా తన పని తాను చేసుకునిపోతున్నాడు. ఇండస్ట్రీ పెద్దల ‘ఆశీర్వాదం’ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. 


విష్ణు ఆదివారం నందమూరి బాలకృష్ణను కలిశారు. ‘అఖండ’ షూటింగులో బిజీగా ఉన్న బాలయ్యకు తమ ప్యానెల్ మ్యానిపేస్టో వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తనకు మద్దతు తెలిపారని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘నట సింహం బాలా అన్నా.. మీ మద్దతుకు ధన్యవాదాలు. మా ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలవడం చాలా గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. తన మ్యానిఫెస్టోలోని అంశాలను ఇష్టపడి బాలయ్య తనకు మద్దతు ఇచ్చారని విష్ణు ఈ సందర్భంగా తెలిపారు.






రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుతో కూడా మంచు విష్ణు భేటీ అయ్యారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. మా ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘‘ఒరిజనల్ రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నుంచి ఆశీస్సులు అందాయి’’ అని విష్ణు ట్వీట్‌ చేశారు. అయితే, రెబల్ స్టార్‌ను ‘ఒరిజనల్’ అని పేర్కోవడంపై మంచు విష్ణు ఉద్దేశం ఏమిటని ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. అంటే ప్రభాస్ ఒరిజనల్ కాదనా మీ ఉద్దేశమా అంటూ విష్ణును ట్రోల్ చేస్తున్నారు. కృష్ణను కలిసినప్పుడు ఒరిజినల్ సూపర్ స్టార్ అని అంటావా అని అడుగుతున్నారు. 


నెటిజనుల కామెంట్స్:






 






Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్


Also Read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం.. సిగ్గుపడేలా మాట్లాడకు: ప్రకాష్ రాజ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి