దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 20,799 కేసులు నమోదుకాగా 180 మంది చనిపోయారు. 26,718 మంది కరోనా నుంచి రికవరయ్యారు. గత 200 రోజుల్లో ఇవే రోజువారి అత్యల్ప కేసులు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 97.89%కి చేరింది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.
- యాక్టివ్ కేసులు: 2,64,458
- మొత్తం రికవరీలు: 3,31,21,247
- మొత్తం మరణాలు: 4,48,997
- మొత్తం వ్యాక్సినేషన్: 90,79,32,861
కేరళలో..
కేరళలో కొత్తగా 12,297 కరోనా కేసులు నమోదుకాగా 74 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 47,20,233కి పెరిగింది. మృతుల సంఖ్య 25,377కు చేరింది.
మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో (1,904) అత్యధిక కేసులు నమోదయ్యాయి. త్రిస్సూర్‌లో (1,552), తిరువనంతపురలో (1,420), కోజికోడ్‌లో (1,112) కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే తరహాలో కరోనా కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో
మహారాష్ట్రలో కొత్తగా 2,692 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు. 2,716 మంది బాధితులు రికవరయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: Lakhimpur Violence: యూపీ లఖింపుర్ ఖేరీలో హై టెన్షన్.. ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్ అరెస్ట్