4వ తేదీన రాత్రి సమయంలో ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు స్తంభించిపోయాయి. అసలు ఏమైదంటూ.. యూజర్లు.. నానా హైరానా పడిపోయారు. అయితే తమదే తప్పు అని ఫేస్ బుక్ ప్రకటించింది. ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎలాంటి సమాచారం లేకుండా.. ఇలా జరగడంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే కొత్తగా మళ్లీ ఇన్​స్టాగ్రామ్​, ఫేస్‌బుక్‌​ సేవలు నిలిచిపోవడం కలకలం రేపింది.






8వ తేదీన(శుక్రవారం) ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ సేవలలో మళ్లీ అంతరాయం వచ్చింది. ఇక యూజర్లు సోషల్​మీడియాలో ఏమైంది బాబు అంటూ.. చర్చలు చేశారు. అయితే సేవలు నిలిపోయిన మాట వాస్తవమేనని.. పరిష్కరిస్తున్నామని.. అక్టోబర్​ 9 వ తేదీ 12.59 AM కి అంటే శనివారం రోజున ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ చెప్పాయి. రెండు గంటల తర్వాత సేవలను పునరుద్దరించారు. ఈ మేరకు ఆ సంస్థలు ప్రకటన చేశాయి. అయితే అప్పటికే చాలామంది తమ అకౌంట్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేశారు.






కేవలం ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థల సేవలకు మాత్రమే అంతరాయం కలగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఈ సమస్య తలెత్తి అవకాశం ఉందని చెబుతున్నారు టెక్ నిపుణులు. డీఎన్ఎస్, బీజీపీ వల్ల సేవలు నిలిచిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.


Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?


Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం


Also read: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఆరోగ్యకరమైన పద్ధతులు ఇవిగో...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి