ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ప్లాట్‌ ఫామ్స్ లు సోమవారం ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. సుమారు 7 గంటలపాటు ఈ దిగ్గజ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ సేవల్లో అంతరాయం కలిగింది. అయితే ఈ కారణంగా చాలామంది నెటిజన్లు పోర్న్ సైట్ మీద పడ్డారు. ఫేస్‌బుక్ సేవలు అంతరాయం కలిగిని ప్రతి గంటకు.. పోర్న్‌హబ్ అర మిలియన్ అదనపు వినియోగదారులను పొందింది . ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోయాక.. పోర్న్ హబ్ సైట్ కు 10.5 శాతం వరకు ట్రాఫిక్ పెరిగిందని పోర్న్‌హబ్ తెలిపింది .  



ప్రపంచంలో ఎక్కువమంది యూజర్లు విజిట్ చేసే.. సైట్ గా పోర్న్ హబ్ ఉంది. చాలా తెలివైన మార్కెటింగ్ టెక్నిక్స్ తో ఈ సైట్ ప్రత్యేకంగా నిలుస్తుంది.  ఉదాహరణకు వర్చువల్ రియాలిటీ(VR) అనుభవాలను అందించే మొట్టమొదటి పోర్న్ సైట్‌లలో ఇది ఒకటి. అయితే ఈ సైట్ పై వివాదం కూడా ఉంది. ఏకాభిప్రాయం లేని పోర్న్ వీడియోలు ఇందులో అప్ లోడ్ చేయడంపై రచ్చ నడిచింది. పోర్న్‌హబ్ యూట్యూబ్ లాగా పనిచేస్తుంది. ఎవరైనా కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే ఈ సైట్ లోకి ఫేస్ బుక్ డౌన్ అవ్వడంతో.. 10 శాతానికిపైగా.. యూజర్లు పెరిగారని.. పోర్న్ హబ్ ప్రకటించింది.






 


4వ తేదీన రాత్రి సమయంలో ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు స్తంభించిపోయాయి. అసలు ఏమైదంటూ.. యూజర్లు.. నానా హైరానా పడిపోయారు. అయితే తమదే తప్పు అని ఫేస్ బుక్ ప్రకటించింది. ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎలాంటి సమాచారం లేకుండా.. ఇలా జరగడంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. 
గతంలో కొన్ని పర్యాయాలు వాట్సాప్ గానీ, ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయాయి. కానీ గతానికి భిన్నంగా ప్రస్తుతం ఒకేసారి వాట్సాప్, ఫేస్ బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ సేవలు చాలా సమయం నిలిచిపోవడం చర్చయనీయాంశం అయింది.  ఇది సైబర్ అటాక్ అయి ఉండొచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. చైనా హ్యాకర్లు ఈ చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు.  ఫేస్ బుక్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. 


Also Read: Facebook Server Down: మళ్లీ ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. ఇంతకీ ఏమైనట్టు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి