పని చేసే స్థలంలో ప్రమాదాలు జరిగితే.. తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. ఓ వ్కక్తి.. తనపై అరటి చెట్టు పడిందని.. దాదాపు 4 కోట్ల దావా వేశాడు. అవును ఇది నిజం. అంతేంటీ బాబోయ్ అనుకోకండి.. అసలు విషయంలోకి వెళ్తే పూర్తిగా అర్థం అవుతుంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? ఆస్ట్రేలియాలో..


ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో సమీపంలోని ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు చెందిన అరటి తోటలో జైర్ లాంగ్‌ బాటమ్ అనే వ్యక్తి పని చేసుకుంటున్నాడు. రోజు వారిలానే.. చేస్తున్న పనిలో ఓ ఘటన చోటుచేసుకుంది. కాపునకు వచ్చిన అరటి గెలలను నరుకుతున్నాడు. ఈ సమయంలోనే ప్రమాదవశాత్తు.. అరటి పండ్ల గెలతోపాటు చెట్టు కూడా వచ్చి బాటమ్ పై పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దెబ్బలు ఎక్కువగా తగిలి పాపం.. బాటమ్ వికలాంగుడు అయ్యాడు. ప్రమాద కారణంగా.. ఇక పని చేయలేకపోయాడు. ఉపాధి కోల్పోయాడు. ఏం చేయాలో.. ఎలా బతకాలో తెలియని పరిస్థితి. ఈ సమయంలోనే.. తనకు పరిహారం కావాలని క్వీన్స్ ల్యాండ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు.  


ఈ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. తాజాగా మరోసారి వాదనలు జరిగాయి. పని చేస్తున్న సమయంలో.. అరటి పండ్ల గెల మీద పడటం కారణంతోనే బాటమ్ తీవ్ర గాయపడ్డాడని.. అందువల్లనే లైఫ్ టైమ్ ఉపాధి కోల్పోవలసి వచ్చిందని.. కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనితో.. ఆ అరటి తోట యజమాని దాదాపు 4 కోట్ల రూపాయలు బాధితుడికి చెల్లించాలని.. ఆదేశాలిచ్చింది.  కోర్టు ఆదేశాల ప్రకారం యజమాని.. పూర్తి నష్టపరిహారం చెల్లించాడు. ఈ ఘటన 2016లో జరిగింది. అప్పటి నుంచి విచారణ జరుగుతూ.. తాజాగా తీర్పు వెలువడింది. 


Also Read: Afghan Terrorist Attack: అఫ్గాన్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్.. పోరాటం కొనసాగుతుందంటూ వారికి భరోసా


Also Read: Pornhub Traffic Surged: ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ పని చేయట్లేదని.. ఆ సైట్స్ మీద ఎగబడ్డారుగా యూజర్లు


Also Read: Attack At Saudi Airport : సౌదీ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు.. హైతీ తిరుగుబాటు దారుల పనేనని అనుమానం !


Also Read: World Post Day 2021: ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్‌బుక్.. అప్పట్లో ఆల్ ఇన్ వన్ అయిన పోస్ట్ కార్డ్స్ గురించి ఈ విషయాలు తెలుసా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి