UGC on Asst. Professor Recruitment: అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలంటే పీహెచ్ డీ మస్ట్... ఎప్పటి నుంచి అమలంటే...!

అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సహాయ అధ్యాపకుల నియామకానికి పీహెచ్ డీ నిబంధనలను వాయిదా వేసింది.

Continues below advertisement

విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల డైరెక్ట్ నియామకంపై యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ పరిస్థితుల కారణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి పీ.హెచ్.డి తప్పసరిగా చేయాలనే నిబంధనను  జులై 2023 వాయిదా వేసింది. అంతకు ముందు ఈ నిబంధనను ఈ ఏడాది జులై నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. 

Continues below advertisement

జులై 2023కు వాయిదా

అంతకు ముందు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు లేఖ రాసింది. యూజీసీ రెగ్యూలేషన్స్ 2018 ప్రకారం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో సహాయ అధ్యాపకుల నియామకం కోసం పీ.హెచ్.డీ తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను జులై 2021 నుంచి అమలు చేయాలని యూజీసీ రాసిన లేఖలో స్పష్టం చేసింది. తాజాగా ఈ నిర్ణయాన్ని యూజీసీ వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం గెజిట్ విడుదల చేసింది. గత రెగ్యులేషన్ కు సవరణ చేస్తూ పీహెచ్ డీ నిబంధనను జులై1, 2023కు వాయిదా వేసినట్లు ప్రకటించింది. 

Also Read: ఏపీ స్కూళ్లలో 2024 కల్లా సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌.. అసలేంటీ విధానం?

కొవిడ్ మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నర కాలంలో వేలాది మంది మరణించారు. దీంతో వారి పిల్లల చదువు, భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. తల్లిదండ్రులను కోల్పోవడంతో నిరాశ్రయులయ్యారు. ఇలాంటి వారికి చేయూత అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సిద్ధమైంది. విద్యార్థులకు ఎస్‌బీఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ (SBI General Suraksha Support Scholarship Program) 2021 పేరుతో ఆర్థిక తోడ్పాటు అందించనున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.29,500 నుంచి రూ.38,500 వ‌ర‌కు రివార్డు అందించనున్నట్లు పేర్కొంది.

Also Read: జ్యుయెలరీ డిజైనింగ్ అంటే మీకు ఇష్టమా? ఇందులో కూడా డిప్లొమా, డిగ్రీ చేయొచ్చు.. ఆభరణాల డిజైనర్లకు ఫుల్ డిమాండ్.. 

 చివరి తేదీ అక్టోబర్ 31

కొవిడ్ కారణంగా తల్లి లేదా తండ్రిని (లేదా ఇద్దరినీ) కోల్పోయిన వారి పిల్లలకు ఈ స్కాల‌ర్‌షిప్‌ వర్తిస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.29,500.. గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు రూ.38,500 అందించనుంది. 9 నుంచి 12వ తరగతి (ఇంటర్) విద్యార్థులతో పాటు గ్రాడ్యుయేషన్ చదివే వారికి ఈ ప్రోగ్రాం వర్తించనుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు అక్టోబర్ 31వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement