ప్రతిభావంతులైన విద్యార్థినులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఏటా స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ఇంజనీరింగ్, డిప్లొమా చదివే అమ్మాయిలకు ప్రగతి స్కాలర్‌షిప్‌ పేరుతో ఆర్థిక సాయం చేస్తోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా అర్హులైన విద్యార్థినులకు ఏడాదికి రూ.50000 అందిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్‌ ప్రకటన విడుదలైంది. ఆసక్తి గల వారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ఏఐసీటీఈ వెల్లడించింది. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ సహా మరిన్ని వివరాల కోసం ఏఐసీటీఈ అధికారిక వెబ్‌సైట్‌ https://www.aicte-india.org/ను సంప్రదించవచ్చు. 


Also Read: విద్యార్థుల కోసం స్కాల‌ర్‌షిప్స్.. వచ్చే నెలతో ముగియనున్న గడువు..


ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు? 
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్‌ లేదా డిప్లొమా కోర్సుల్లో ఫస్ట్‌ ఇయర్‌ చదువుతూ ఉండాలి. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.8,00,000కి మించకూడదు. అర్హులైన విద్యార్థినులు ఇద్దరు ఉంటే ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసీటీఈ తెలిపింది. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంబంధిత కాలేజీలో పాలిటెక్నిక్‌ డిప్లొమా లేదా బీటెక్‌ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 2021 ఏడాదికి సంబంధించి 4000 మందికి స్కాలర్‌షిప్స్‌ అందిస్తున్నట్లు ఏఐసీటీఈ ప్రకటించింది. బీటెక్ చదివేవారికి 2000, డిప్లొమా వారికి 2000 చొప్పున కేటాయించింది. ప్రగతి స్కాలర్‌షిప్‌ అధికారిక ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..


ఏడాదికి రూ.50 వేల సాయం.. 
ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీంకు ఎంపికైన విద్యార్థినికి ఏడాదికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఈ డబ్బు అర్హుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతుంది. కాలేజీ ఫీజు, స్టేషనరీ, పుస్తకాలు, ఇతర ఎక్విప్‌మెంట్‌ తదితర అవసరాలకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిని డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానంలో అందిస్తారు. 


Also Read: విద్యార్థులకు హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్‌లు.. 


ఏయే సర్టిఫికెట్లు అవసరం? 
టెన్త్, ఇంటర్మీడియెట్ అకడమిక్ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డ్, సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్‌ పొందిన సర్టిఫికెట్, ట్యూషన్‌ ఫీజు రిసీప్ట్, బ్యాంక్‌ ఖాతా నంబర్ (ఆధార్‌తో లింక్‌ అయిన ఖాతా), బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, అభ్యర్థుల ఫొటోగ్రాఫ్, తల్లిదండ్రుల ధ్రువీకరణ పత్రం అవసరం. 


Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాల‌ర్‌షిప్‌.. ఏడాదికి రూ.38,500 సాయం.. 


Also Read: ఏపీ నిట్‌లో ఎంబీఏ కోర్సు.. అక్టోబర్ 30తో ముగియనున్న దరఖాస్తు గడువు.. ముఖ్యమైన వివరాలివే..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి