ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో చేరాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంలో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2022-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ప్రవేశాలు చేపట్టనుంది. నిట్ కాలేజీలో ఈ ఏడాది నుంచి తొలిసారిగా ఎంబీఏ ప్రవేశాలు చేపడుతున్నట్లు సంస్థ డైరెక్టర్ సూర్యప్రకాశ రావు వెల్లడించారు. ఎంబీఏలో చేరాలనుకునే వారు ఈ నెల 30వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కాలేజీ నుంచి ఏదేనా డిగ్రీలో (గ్రాడ్యుయేషన్) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఎంబీఏ ప్రవేశాలకు అర్హులని తెలిపారు.


జాతీయ స్థాయిలో ఎంబీఏ ప్రవేశాల కోసం నిర్వహించే క్యాట్‌, జీమ్యాట్‌, మ్యాట్‌, సీమ్యాట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయని సూర్యప్రకాశ రావు వివరించారు. ఒకవేళ ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోతే వారికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి.. అందులో వచ్చిన మార్కుల ద్వారా అడ్మిషన్లు కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం ఏపీ నిట్‌ అధికారిక వెబ్‌సైట్‌ nitandhra.ac.in ను సంప్రదించాలని సూచించారు. 



Also Read: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?


నిట్ ఏపీలో ఎంబీఏ స్పెషలైజేషన్ విభాగాల వివరాలు.. 
1. హ్యూమన్ రిసోర్స్ (HR) మేనేజ్‌మెంట్ 
2. మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ 
3. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ 
4. ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ 
5. బిజినెస్ ఎనలటిక్స్ అండ్ డెసిషన్ మేకింగ్ 


Also Read: విద్యార్థుల కోసం స్కాల‌ర్‌షిప్స్.. వచ్చే నెలతో ముగియనున్న గడువు..


దక్షిణాదిలో ఉత్తమ విద్యా సంస్థగా ఏపీ నిట్.. 
ఏపీ నిట్ ఇటీవల అరుదైన గుర్తింపు సాధించింది. దక్షిణ భారత దేశంలో (సౌత్ ఇండియా) ఉత్తమ విద్యా సంస్థ అవార్డును అందుకుంది. ఇటీవల ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన వేడుకలో ఏపీ నిట్‌ డైరెక్టర్‌ సూర్యప్రకాశ రావు అవార్డును అందుకున్నారు. ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ గ్రోత్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన 15వ రాష్ట్రీయ శిక్షా గౌరవ్‌ పురస్కార్‌ వేడుకలో దీనిని ప్రదానం చేశారు. అనంతరం సూర్యప్రకాశ రావు మాట్లాడుతూ... తమ విద్యా సంస్థలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఉద్యోగాలు సాధించేలా వారిని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అధికమయ్యేలా వారిని పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. 


Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..


Also Read: జ్యుయెలరీ డిజైనింగ్ అంటే మీకు ఇష్టమా? ఇందులో కూడా డిప్లొమా, డిగ్రీ చేయొచ్చు.. ఆభరణాల డిజైనర్లకు ఫుల్ డిమాండ్.. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి