Jammu Kashmir Terror Attack: పాఠశాలలో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు టీచర్లు మృతి

ABP Desam   |  Murali Krishna   |  07 Oct 2021 01:23 PM (IST)

శ్రీనగర్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళా టీచర్​ ఉన్నారు.

పాఠశాలలో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు టీచర్లు మృతి

జమ్ముకశ్మీర్ శ్రీనగర్​లోని ప్రభుత్వ పాఠశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు.

ఉదయం 11.15 గంటల సమయంలో ఉగ్రవాదులు.. శ్రీ నగర్ జిల్లా సంగమ్ ఈద్గా పాఠశాలలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు.                           -  పోలీసులు

ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మేల్ టీచర్​ కశ్మీర్​ పండిట్​ కాగా, మహిళా ఉపాధ్యాయురాలు సిక్కు వర్గానికి చెందినట్లు తెలిపారు. ఆ మొత్తం ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

Published at: 07 Oct 2021 01:18 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.