ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే కరోనాకి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాలి. కరోనా ముందు వరకూ కళకళలాడిన థియేటర్లు ఆ తర్వాత వెలవెలబోయాయి. ఎట్టకేలకు ప్రభుత్వాలు అంగీకరించడంతో థియేటర్లు తెరిచినా జనం వస్తారో రారో అనే భయం వెంటాడింది. కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తే చాలనుకున్న నిర్మాతలుఎందరో ఉన్నారు. మరికొందరు హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా  ఎవరికి వారు మరికాస్త వెయిట్ చేద్దామని ఎదురుచూశారే కానీ థియేటర్లలో విడుదల చేసే ధైర్యం చేయలేకపోయారు. అయినప్పటికీ అడపా దడపా కొన్ని సినిమాలు థియేటర్లో సందడి చేసినప్పటికీ ఎక్కువ మూవీస్ ఓటీటీకే ఓటేశాయి. ఇలాంటి సమయంలో 'లవ్ స్టోరీ' సినిమాతో థియేటర్లో అడుగుపెట్టాడు నాగచైతన్య. ప్రేక్షకులు వస్తారో రారో అనే సందిగ్ధం నుంచి బయట పడి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా.  ఈ మధ్యే విడుదలై అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కూడా  సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.  అక్కినేని కుటుంబానికి చెందిన నాగ చైతన్య.. అఖిల్ ఇద్దరి సినిమాలు రెండు వారాల వ్యవధిలో థియేటర్లలో విడుదల కావడం ఒకెత్తైతే రెండూ సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడం మరో ఎత్తు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ ఇదే విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.


థియేటర్ కు ప్రేక్షకులు వస్తారా అన్న భయాందోళనతో ఉన్న ఇండస్ట్రీలో...వరుస సినిమాలతో సినీ పరిశ్రమకు సరికొత్త ఉత్సాహాన్ని.. ధైర్యాన్ని ఇవ్వటంలో అక్కినేని అన్నదమ్ములు నిలిచారన్న బన్నీ మాటలు ఆసక్తికరంగా మారింది. ఇంకా ఏమన్నాడంటే...'అఖిల్‌కి సక్సెస్‌ వచ్చినందుకు హ్యాపీ. తను డ్యాన్స్, ఫైట్స్‌ బాగా చేస్తాడు. కానీ వాటిని పక్కనపెట్టి ఓ మంచి సినిమా చేయాలని ఈ చిత్రం చేశాడు. ఆ చాయిస్‌ను గౌరవిస్తాను.  రీసెంట్‌గా నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’తో, ఇప్పుడు ఈ సినిమాతో అఖిల్‌ హిట్‌ కొట్టారు. ఇద్దరు బ్రదర్స్‌ ఒకే సీజన్‌లో ఇంత పెద్ద హిట్స్‌ సాధించడం అనేది అనుకున్నా కూడా కుదరదు. అది ఎంతో సంతోషాన్నిచ్చింది. మా నాన్నగారు తన లైఫ్‌లో ఎప్పుడూ స్ట్రెస్‌ ఫీల్‌ కాలేదు. కానీ ఈ సినిమా జర్నీలో ఫీలయ్యారు. ఆయన అనుకుంటే ‘ఆహా’లో రిలీజ్‌ చేయవచ్చు. కానీ ఫైనాన్షియల్‌ స్ట్రెస్‌ తీసుకుని కూడా జనాలు థియేటర్స్‌కు రావాలని థియేటర్స్‌లో విడుదల చేశారు. నాన్నగారు ఎవరితో సినిమా చేస్తే వారి కెరీర్‌లో అది బెస్ట్‌ ఫిల్మ్‌. హిట్‌ కొట్టిన యూనిట్‌కి కంగ్రాట్స్‌’’ అన్నాడు. ఇద్దరి సినిమాలకు మంచి టాక్ రావడం మాత్రమే కాదు...ఇండస్ట్రీలో పలవురినుంచి ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉందంటున్నారు అక్కినేని అన్నదమ్ములు.
Also Read: భారత్-పాక్ సరిహద్దులో జాతీయ జెండా ఎగురవేసిన అజిత్
Also Read: సన్నీ-ప్రియ మధ్య మరింత అగ్గి రాజేసిన 'బంగారు కోడిపెట్ట'... ప్రేమ-పగ-స్నేహం-ఆవేదన..నవరసాలు పలికించిన ఇంటి సభ్యులు...
Also Read: ఒరే అయ్యా... ఎక్కడున్నా నేను త్వరలోనే కలుస్తా... అభిమానికి అఖిల్‌ ఆఫర్‌
Also Read: ఆలయాల చుట్టూ తిరుగుతున్న కోలీవుడ్ ప్రేమ జంట
Also Read: బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న శ్రీలంక సన్సేషనల్ సింగర్ యొహానీ
Also Read: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 'రాథేశ్యామ్' టీజర్?
Also Read: 'మా'లో అంతా జోకర్లే.. ఆర్జీవీ ట్వీట్‌కు మంచు మనోజ్ స్ట్రాంగ్ రిప్లై
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి