'బాహుబలి' ముందు వరకూ టాలీవుడ్ హీరో అనిపించుకున్న ప్రభాస్...బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఒక్కసారిగా మార్కెట్ పెరిగిపోయింది. 'బాహుబలి 'తర్వాత వచ్చిన సాహో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందించలేకపోయినా ప్రభాస్ క్రేజ్ అస్సలు తగ్గలేదు. పైగా వరుస పాన్ ఇండియా మూవీస్ తో మరింత బిజీ అయిపోయాడు.  వీటన్నంటిలో ముందుగా థియేటర్లలో సందడి చేయనున్న సినిమా 'రాథేశ్యామ్'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే కేవలం పోస్టర్స్ తప్ప అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేలా టీజర్ మాత్రం ఇప్పటికీ రాలేదు. మరోవైపు 'పుష్ప', 'ఆచార్య', 'భీమ్లానాయక్'..ఇలా అన్ని క్రేజీ మూవీస్ నుంచి అప్ డేట్స్ మీద అప్ డేట్స్ వస్తున్నాయి.  టీజర్, సాంగ్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంటే తమ అభిమాన హీరో ప్రభాస్ 'రాథేశ్యామ్' కి టీజర్ కూడా ఇప్పటికీ రాలేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మేరకు #AnnounceRadheShyamTeaser అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Also Read: 'సిరి ఆట-సన్నీ వేట' విలవిల్లాడిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..ఈ వారం నామినేషన్లో ఉన్నదెవరంటే…
ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు  సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. అటు మేకర్స్ ఆలోచన కూడా ఇదే అన్నట్టు తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా   ప్రభాస్ - పూజ పాత్రలపై ఫోకస్ చేస్తూ కట్ చేసిన టీజర్  వదలనున్నట్టుగా టాక్.  ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు ఇదే ఫస్ట్ స్టెప్ అంటున్నారు.  
యూవీ క్రియేషన్స్ - టి సిరీస్ భారీగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. 
Also Read: పొట్టి డ్రస్సులో జూనియర్ సమంత హొయలు...వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఫొటోస్..
ఇటలీ బ్యాక్ డ్రాప్ లో సాగే అందమైన ప్రేమకథ ఇది. పునర్జన్మలతో ముడిపడి ఈ ప్రేమకథ కొనసాగుతుందని తెలుస్తోంది.   జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటి వరకూ 'రాథేశ్యామ్'  నుంచి వచ్చిన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ వచ్చిన తర్వాత  అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకునేలా ఉంటుందంటున్నారు మేకర్స్. టీజర్ రావడమే ఆలస్యం... గ్యాప్ లేకుండా ఈ మూవీ నుంచి అప్ డేట్స్ రానున్నాయని అంటున్నారు.  కృష్ణంరాజు- భాగ్యశ్రీ కీలక పాత్రలను పోషించిన ఈ  సినిమా సంక్రాంతి బరిలో సందడి చేయనుంది. మరోవైపు ప్రభాస్ 'సలార్',  'ఆది పురుష్' షూటింగ్ లోనూ బిజీగా ఉన్నారు. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయ్యాక మరో రెండు సినిమాలు క్యూలో ఉన్నాయట. చూస్తుంటే బాహుబలితో మొదలైన దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదంటున్నారంతా...
Also Read: ఏంది మలైకా…ఇట్టుంటే ఎట్టా…
Also Read: కుర్రాళ్ల గుండెల్లో 'ఉప్పెన' సృష్టిస్తోన్న కృతి శెట్టి
Also Read: ‘అంత దిగజారి మాట్లాడతారా?’.. కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యలపై అనసూయ ఫైర్
Also Read: ఇది లోబడ్జెట్ ‘స్క్విడ్ గేమ్’.. అదరగొట్టేసిన పిల్లలు.. కొరియన్ వెబ్‌సీరిస్ రికార్డుల మోత!
Also Read: టవల్ జారిపోతుంది.. జాగ్రత్తగా చూసుకో.. టాప్ హీరోపై పూజా హెగ్డే కామెంట్ వైరల్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి