బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఫిట్‌నెస్, స్టైలింగ్‌కు ఎంతో ప్రాధాన్యతను ఇస్తాడన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన ఎయిట్ ప్యాక్స్‌ను ప్రదర్శిస్తూ ఇన్‌స్టాగ్రాంలో ఒక ఫొటోను షేర్ చేశాడు. ఆ పోస్టుకు ఏకంగా 20 లక్షల లైకులు వచ్చాయి. ఎంతో మంది సెలబ్రిటీలు తన ఫిట్‌నెస్‌ను మెచ్చుకుంటూ దాని కింద కామెంట్లు కూడా చేశారు.


అయితే దాని కింద పూజా హెగ్దే చేసిన కామెంట్ మాత్రం ఇప్పుడు బాగా వైరస్ అవుతుంది. ‘Towel gir raha hain, Pammi! Dhyaan rakhna’ అంటూ కామెంట్ చేసింది. ‘టవల్ జారిపోతుంది, జాగ్రత్తగా చూసుకో’ అని చూసుకో అని దాని అర్ధం. మిగతా సెలబ్రిటీల కామెంట్లకు వందల్లో లైకులు వస్తే.. పూజా కామెంట్‌కు ఏకంగా మూడున్నర వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. మిగతా సెలబ్రిటీల కామెంట్లకు ఐదు, పది రిప్లైలు వస్తే.. పూజా కామెంట్లకు ఏకంగా 270కి పైగా రిప్లైలు రావడం విశేషం.


పూజా హీరోయిన్‌గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో ఉన్న ‘బాగా వైల్డ్‌గా థింక్ చేయ్’ అనే కామెంట్‌నే రిప్లైగా ఇస్తూ అభిమానులు కామెడీ చేస్తున్నారు. రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రాంలో చేసిన ఫొటో ఇదే. దాని కింద పూజా హెగ్దే కామెంట్ కూడా చూడవచ్చు.








ప్రస్తుతం సర్కస్ అనే బాలీవుడ్ సినిమాలో రణ్‌వీర్ సింగ్, పూజా హెగ్దే జంటగా నటిస్తున్నారు. ఇక రణ్‌‌వీర్ సింగ్ నటించిన సూర్యవంశీ, 83 చిత్రాలు ఈ సంవత్సరమే విడుదల కానున్నాయి. దీంతోపాటు జయేష్‌బాయ్ జోర్డార్, సర్కస్, రాకీ అవుర్ రాణీకి ప్రేమ్ కహానీ అనే సినిమాల్లో కూడా రణ్‌వీర్ నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలూ వచ్చే సంవత్సరమే రానున్నాయి. అంటే రానున్న 14 నెలల్లో ఐదు సినిమాలను రణ్‌వీర్ విడుదల చేయనున్నాడన్న మాట.


ఇక పూజా హెగ్డే కూడా చాలా బిజీగానే ఉంది. గతేడాది అలవైకుంఠపురంలో సినిమాలో ఇండస్ట్రీ హిట్ హీరోయిన్‌గా మారిన పూజ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. మొదటిసారి రామ్ చరణ్ సరసన నటిస్తున్న ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్, తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా బీస్ట్, త్రివిక్రమ్, మహేష్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #SSMB28 సినిమాలో కూడా తనే హీరోయిన్, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్‌లో కూడా పూజా హెగ్దేనే హీరోయిన్ అని టాక్ వినిపిస్తుంది. 


Also Read: అందుకే పవన్‌తో మాట్లాడలేదు.. ఎవరుపడితే వాళ్లు ‘మా’లో సభ్యులు కాకూడదు: విష్ణు


Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు


Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి