‘మా’ ఎన్నికల్లో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు. సోమవారం మంచు విష్ణుతోపాటు ఆయన తండ్రి మోహన్ బాబు, సోదరి మంచు లక్ష్మి, ప్యానల్ సభ్యులు బాబు మోహన్, శివబాలాజీ తదితరులతో కలిసి తిరుమలకు వెళ్లారు. వేంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత శ్రీవిద్యానికేతన్‌లో విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. 


ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ‘‘అసోసియేషన్‌లోని చాలా విషయాల్లో బైలాస్‌ను మార్చాలనుకుంటున్నా. బైలాస్‌ మార్చడమంటే అంత ఈజీ కాదు. దీనిపై సినీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాను. ఎవరుపడితే వాళ్లు ‘మా’ సభ్యులు కాకూడదనేదని నేను భావిస్తున్నా. ప్రకాశ్‌ రాజ్‌ సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారు. అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదు. ఆ రోజు రాత్రి ఆలస్యం కావడంతో తర్వాతి రోజు కౌంటింగ్ కొనసాగించారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం ‘మా’ సభ్యుల హక్కు. ప్రకాశ్‌రాజ్‌, నాగబాబుల రాజీనామాను ఆమోదించలేదు. త్వరలోనే దీనిపై ప్రకాశ్‌ రాజ్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తా’’ అన్నారు. 


పవన్‌తో మాట్లాడా..: ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, విష్ణు.. మాట్లాడుకోలేదని వస్తున్న వార్తలపై విష్ణు స్పందించారు. ‘‘చిరంజీవి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్, అలయ్ బలయ్ కార్యక్రమం వేదిక పైకి రాకముందే పవన్ కళ్యాణ్‌తో నేను మాట్లాడాను. మేమిద్దరం చాలా విషయాలపై చర్చించుకున్నాం. ప్రోటోకాల్ ప్రకారమే మేము వేదిక మీద మాట్లాడుకోలేదు. దాన్నే మీడియా హైలెట్ చేసింది. పవన్ కళ్యాణ్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. వారిని సర్‌ప్రైజ్ చేయడం కోసమే నేను ట్వి్ట్టర్‌లో ఆయన వీడియో పోస్ట్ చేశాను. నాన్నతో చిరంజీవి ఫోన్లో మాట్లాడారు. ఏం మాట్లాడుకున్నారనేది నాన్నని అడగండి’’ అని విష్ణు అన్నారు. 


విష్ణుకు థాంక్స్.. ప్రకాష్ రాజ్: ‘‘ఎన్నికల నిర్వహణపై మాకు అనుమానాలు ఉన్నాయి. అందుకే నేను సీసీటీవీ ఫూటేజ్ కావాలని కోరాను. స్కూల్ సీసీటీవీ కెమేరాల్లో రికార్డైన వీడియోలను పరిశీలించాను. ఇవి కాకుండా ఎన్నికల అధికారి వద్ద మరో ఏడు సీసీటీవీ వీడియోలు ఉన్నాయి. వాటిని ఇవ్వాలని కోరగా.. ఆయన స్పందించడం లేదు. కేవలం మీడియాతోనే మాట్లాడుతున్నారు. సీసీటీవీ వీడియోలు పరిశీలించేందుకు అనుమతి ఇచ్చిన విష్ణుకు థాంక్స్. నాకు విష్ణుతో సమస్య లేదు. కేవలం ఈసీతోనే. మరో వారం తర్వాత మళ్లీ దీనిపై మాట్లాడతాం’’ అని ప్రకాష్ రాజ్ అన్నారు. 


Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు


Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి