సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచీ టాలెంట్ మారుమూల నుంచి ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. ఒక్కసారి వీడియో వైరల్ అయితే టాలెంట్ ను ఆపడం, అడ్డుకోవడం ఎవ్వరి వల్లా కాదు. అదీ సోషల్ మీడియా పవర్. ఈ కోవలోనే ఇంటర్నెట్ ను షేక్ చేసింది  శ్రీలంక సింగర్, రాపర్ యొహానీ. ఇంటర్నెట్ షేక్ చేసిన సాంగ్ ‘మాణికే మాగే హితే’. ఎక్కడో శ్రీలంకలో పుట్టిన సాంగ్ ఖండాలు దాటి అంతర్జాతీయ స్థాయిలో అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇలా తన స్వరంతో సోషల్‌ మీడియాను ఒక ఊపు ఊపిన ఈ అమ్మడు ఇపుడు బాలీవుడ్‌ తెరంగేట్రం చేస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టిన ఈ పాటకు హిందీ వెర్షన్‌ అప్‌ కమింగ్‌ మూవీ 'థాంక్‌ గాడ్‌ ' ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. ఇంద్రకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'థ్యాంక్‌ గాడ్‌'లో అజయ్ దేవ్‌గణ్‌, సిద్ధార్థ్ మల్హోత్రా ,రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. 
Alos Read: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 'రాథేశ్యామ్' టీజర్?
ఒక్క పాటతో సూపర్ సింగర్ గా ఎదిగిన యొహానీది శ్రీలంకలో కొలంబో. అక్కడ ఆమె సూపర్ ర్యాపర్. పాటలు రాయగలదు. తండ్రి ఓ ఆర్మీ అధికారి. తల్లి ఎయిర్ హోస్టెస్. చిన్నప్పట్నించే యోహానికి సంగీతం అంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గుర్తించిన తల్లి ప్రోత్సహించింది. యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి అందులో తన పాటను పోస్టు చేసేది. యూట్యూబ్ ద్వారానే గుర్తింపు పొందింది. ఈమె పాటకు మన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ఫిదా అయిపోయారు. ఆ పాట ఎంతగానో నచ్చిందని, ఒక రాత్రంతా వింటూనే ఉన్నానని చెప్పారు. పరిణితి చోప్రా, మాధురి దీక్షిత్ , సింగర్‌‌‌‌ సోనూ నిగమ్‌‌ వాళ్లంతా ఫ్యాన్స్ అయిపోయాం అన్నారు. ఈ ఏడాది మే22న ఆమె మాణికే మాగే హితే పాటను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేసింది. అతి తక్కువ సమయంలోనే. శ్రీలంకతో పాటూ ఇండియా, మరికొన్ని దేశాల్లో పాట సూపర్ హిట్ అయ్యింది. ఆ పదాలకు అర్థాలు తెలియకపోయినా... కేవలం సంగీతానికి, ఆమె స్వరానికే అందరూ ముగ్ధులైపోయారు. సింహళ భాషలో ఉన్న ఆ పాట తమిళం, బెంగాళీ, తెలుగు భాషల్లోకి కూడా రీమేక్ అయ్యింది.   యొహానీ పాటకు వచ్చిన రీమేక్‌‌ సాంగ్స్‌‌ కూడా మ్యూజిక్‌‌ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. 


యొహానీకి క్రేజ్ తెచ్చిపెట్టిన సాంగ్ ఇదే 



'మణికే మాగే 'తెలుగు పాట ఇక్కడ చూడండి



Also Read: 'సిరి ఆట-సన్నీ వేట' విలవిల్లాడిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..ఈ వారం నామినేషన్లో ఉన్నదెవరంటే…
Also Read: పొట్టి డ్రస్సులో జూనియర్ సమంత హొయలు...వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఫొటోస్..
Also Read: కుర్రాళ్ల గుండెల్లో 'ఉప్పెన' సృష్టిస్తోన్న కృతి శెట్టి
Also Read: ‘అంత దిగజారి మాట్లాడతారా?’.. కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యలపై అనసూయ ఫైర్
Also Read: ఇది లోబడ్జెట్ ‘స్క్విడ్ గేమ్’.. అదరగొట్టేసిన పిల్లలు.. కొరియన్ వెబ్‌సీరిస్ రికార్డుల మోత!
Also Read: టవల్ జారిపోతుంది.. జాగ్రత్తగా చూసుకో.. టాప్ హీరోపై పూజా హెగ్డే కామెంట్ వైరల్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి