టీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్న కమెడియన్.. అవినాష్. ముక్కు అవినాష్‌గా ఫన్నీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అవినాష్‌కు ‘బిగ్ బాస్’ సీజన్-4లో అవకాశం రావడంతో ‘జబర్దస్త్’ను వదిలేయాలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత స్టార్ మా చానెల్‌లో ‘కామెడీ స్టార్స్’లో అవినాష్‌కు అవకాశం లభించింది. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితురాలైన అనుజతో నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ బుధవారం ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. 


అవినాష్ పెళ్లికి తన స్నేహితులు యాంకర్ శ్రీముఖి, ఆటో రాం ప్రసాద్, అరియానా గ్లోరీ, సయ్యద్ సోహైల్, దివి తదితరులు హాజరై సందడి చేశారు. అవినాష్.. అనుజా మెడలో తాళి కడుతున్న వీడియోను రాం ప్రసాద్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. ‘‘క్షమించు అవినాష్, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. కానీ, తప్పడం లేదు. హేవ్ ఫన్’’ అంటూ పెళ్లి వీడియోను లీక్ చేస్తున్నట్లు చెప్పాడు. వాస్తవానికి అవినాష్ తన పెళ్లి వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఆ వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేయాలని అనుకున్నాడు. అంతకంటే ముందే రాం ప్రసాద్ దాన్ని లీక్ చేశాడు. అందుకే.. ఆటో ఆ క్యాప్షన్ ఇచ్చి ఉండవచ్చని అనుకుంటున్నారు. అవినాష్ పెళ్లికి సంబంధించిన ఆ వీడియో, ఫొటోలను ఇక్కడ చూడండి. 


Also Read: సన్నీ-ప్రియ మధ్య మరింత అగ్గి రాజేసిన 'బంగారు కోడిపెట్ట'














Also Read: 'మా'లో అంతా జోకర్లే.. ఆర్జీవీ ట్వీట్‌కు మంచు మనోజ్ స్ట్రాంగ్ రిప్లై



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి