సినిమాల్లో ప్రతినాయుకుడి పాత్రల్లో నటించినా.. నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకుంటున్నారు నటుడు సోను సూద్. కేవలం కరోనా వైరస్ సమయంలోనే కాదు.. ఆ తర్వాత కూడా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తన సొంత డబ్బుతో కాదనుకుండా సాయాన్ని అందిస్తున్నారు సోను. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తున్న సోనూసోద్‌ను అంతా మానవ రూపంలో ఉన్న దేవుడని కొనియాడుతున్నారు. తాజాగా ఆయన అందించిన సహాయం గురించి తెలిస్తే మీరు కూడా అదే అంటారు. 


ఖమ్మం జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు కృష్ణ, బిందు ప్రియ దంపతులకు ఈ ఏడాది జులైలో కుమారుడు పుట్టాడు. పసివాడు సాత్విక్(3 నెలలు)కు పుట్టుక నుంచి గుండె సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో అప్పు చేసైనా తన బిడ్డను కాపాడుకోవాలని అనుకున్నారు. కానీ, అది సాధ్యం కాకపోవడంతో సాయం కోసం ఎదురుచూశారు. చికిత్సకు సరిపడా డబ్బు లేకపోవడం వల్ల తన బిడ్డ ప్రాణాలను కాపాడలేకపోతున్నామని తల్లడిల్లారు. 


Also Read: అవినాష్ పెళ్లి.. తప్పు జరిగిపోయిందంటూ రామ్ ప్రసాద్ కామెంట్స్, ఆ వీడియో లీక్!


కృష్ణా జిల్లాలోని తిరువూరుకు చెందిన జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ఆ చిన్నారి సమస్యను సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సోనుసూద్.. ముంబయిలోని వాడియా ఆస్పత్రిలో సాత్విక్‌కు శనివారం  అత్యంత  కష్టమైన  గుండె ఆపరేషన్‌  చేయించారు.  తన సొంత ఖర్చులతో చిన్నారికి సర్జరీ చేయించారు. చికిత్స విజయవంతం కావడంతో చిన్నారి ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు సోనుసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 


Also Read: సన్నీ-ప్రియ మధ్య మరింత అగ్గి రాజేసిన 'బంగారు కోడిపెట్ట'