డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలంటే కుర్రాళ్లుకు ఎంత క్రేజో తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ అనే సినిమాలో తెరకెక్కిస్తున్నారు. మరోవైపు పూరీ తనయుడు ఆకాష్ మాత్రం ఇంకా హీరోగా సెటిల్ కాలేదు. అతడు హీరోగా నటించిన ‘మెహబూబా’ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆకాష్ మరోసారి ‘రొమాంటిక్’ చిత్రం ద్వారా తన లక్ పరీక్షించుకోడానికి వస్తున్నాడు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్.. ‘రొమాంటిక్’ ట్రైలర్‌ను విడుదల చేశారు.   


టైటిల్‌కు తగినట్లే.. ఈ ట్రైలర్ రొమాన్స్‌తో మొదలైంది. ‘‘ఐ లక్ దిస్ యానిమల్. నిన్ను నువ్వు ఎప్పుడైనా వెనుక నుంచి చూసుకున్నావా? చచ్చిపోతున్నాం ఇక్కడ’’ అనే పూరీ మార్క్ డైలాగుతో రొమాన్స్ మొదలైంది. ‘‘ఆడోళ్లతో పెట్టుకుంటే చంక నాకిపోతావ్ రేయ్’’ అనే డైలాగ్ ద్వారా ఆకాష్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేశారు. ‘‘పట్టుకోవడం’’ అనే పదానికి కూడా కొత్త అర్థాన్ని పూరీ తన డైలాగులతో చెప్పారు. ‘‘ప్రేమ వల్ల వీకైపోతాం. ఏదైనా తేడా వస్తే ఆడవాళ్లు ఏడుస్తారేమో. మగాళ్లు వెక్కి వెక్కి ఏడుస్తారు’’ అనే డైలాగ్ నచ్చతుంది. చివర్లో ‘‘చాలామంది మోహానికి పెట్టుకొనే పేరు ప్రేమ. కానీ, వీరు ప్రేమలో ఉన్నా మోహం అనుకుంటున్నారు’’ అని రమ్యకృష్ణ డైలాగ్ బాగుంది. మొత్తానికి ఈ చిత్రం తప్పకుండా యూత్‌ను ఆకట్టుకొనేలాగే ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి. 


‘రొమాంటిక్’ ట్రైలర్:



ఈ చిత్రం షూటింగ్ రెండేళ్ల క్రితమే మొదలైంది. కానీ, కరోనా వైరస్ వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో చిత్రాన్ని అక్టోబరు 29న విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి పూరి జగన్నాథ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా, ఆయన శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ఇస్తున్నట్లు సెన్సార్ బోర్డు ప్రకటించింది. ఈ చిత్రంతో కేతికా శర్మ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచమవుతోంది. మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునయన తదితరలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 






Also Read: అందుకే పవన్‌తో మాట్లాడలేదు.. ఎవరుపడితే వాళ్లు ‘మా’లో సభ్యులు కాకూడదు: విష్ణు


Also Read: ‘మా’ గొడవ విష్ణుతో కాదు, ఈసీతోనే.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి