తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రిని బూతులు తిట్టి రెచ్చగొడుతున్నారని.. ఇక ముందు అర్థం పర్థం లేకుండా దారుణంగా తిడితే ఇలాగే రియాక్షన్ ఉంటుందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఏపీలో జరిగిన దాడుల ఘటనపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు దేవాలయంగా చెప్పారని.. ఆ దేవాలయంలో బూతులు మాట్లాడుతారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని పట్టుకుని బోషడీకే అని తిట్టారని.. ఆ పదం ఉత్తరాదిలో చాలా బూతు పదమన్నారు. ఒక సారి కాదని పదే పదే ఆ మాట అన్నారని మండిపడ్డారు. 


Also Read : " ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు " - 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష !


ముఖ్యమంత్రిని అలా తిట్టారు కాబట్టే రియాక్షన్ వచ్చిందన్నారు. గత ఆరు నెలలుగా టీడీపీలో నిరాశా నిస్ప్రహలు పెరిగి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాట్లాడింది పట్టాభి అయితే మాట్లాడించింది చంద్రబాబేనని సజ్జల స్పష్టం చేశారు. మొత్తం ఘటనకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని ఆరోపించారు. ఆయనే బాధ్యత తీసుకోవాలన్నారు. అసలు ఆ మాటే అనకపోతే ఎలాంటి వివాదం ఉండేది కాదన్నారు. ఆ మాట అనబట్టే ఈ రియాక్షన్ వచ్చిందన్నారు. అన్ని మాటలు మాట్లాడిన చంద్రబాబు .. పట్టాభి మాట్లాడిన ఆ పదాన్ని వ్యతిరేకిస్తున్నానని అనలేదని గుర్తు చేశారు. 


Also Read : నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ?


జనం అంటే టీడీపీ నాయకులకు ఎగతాళి అయిపోయారని.. విశ్వాసం కోల్పోయిన నేతలు చులకన అవుతున్నారని విమర్శించారు. చేతకాని దద్దమ్మలే తిట్లు తిడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి పాలన పెట్టాలన్న చంద్రబాబు డిమాండ్‌ను తప్పు పట్టారు. దానికి అంత ఆతృత ఏమిటని ప్రశ్నించారు. బూతులు మాట్లాడే టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి అడగాలనుకుంటున్నామన్నారు. పది రూపాయలకు బేరం పెడితే ...పావులాకు అమ్ముడు పోరని విమర్శించారు. 


Also Read : బూతులు వినలేక .. అభిమానించే వాళ్లకు బీపీ వచ్చి రియాక్టయ్యారు : జగన్


వైఎస్‌ జగన్‌కు పథకాలతో ప్రజలను ఆదుకుంటున్నారని.. ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్న వైనం చూసి టీడీపీ నేతలకు ఏమీ తోచడం లేదన్నారు. అందుకే తిట్లను అందుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని తిడితే ఖచ్చితంగా రియాక్షన్ వస్తుందని స్పష్టం చేశారు. మళ్లీ మళ్లీ అదే మాటలు మాట్లాడినా అదే రియాక్షన్ వస్తుందని స్పష్టం చేశారు. 


Also Read: ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..! అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి