Chandrababu: పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు

ABP Desam Updated at: 21 Oct 2021 10:21 AM (IST)
Edited By: Venkateshk

గురువారం ఉదయం 8 గంటలకు ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల దీక్ష మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

దీక్షలో మాట్లాడుతున్న చంద్రబాబు

NEXT PREV

టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి వ్యవహారంలో పోలీసుల తీరుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం ఉదయం 8 గంటలకు ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల దీక్ష మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన అనంతరం ఘటన స్థలానికి పోలీసులు వచ్చి దుండగులను సాగనంపారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారిని అరెస్టు చేయాల్సింది పోయి.. దగ్గరుండి సాగనంపడం ఏంటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శాంతిభద్రతలు ఏపీలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. ‘‘ఇలాంటి సందర్భంలో ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెడతారు. టీడీపీ ఎప్పుడూ ఈ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు కొంత మంది ఒక రాష్ట్ర పార్టీ ఆఫీసుపై దాడి చేయడం.. అంతా ప్రణాళిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరగడం వల్ల రాష్ట్రపతి పాలన పెట్టాలని అడుగుతున్నాం.’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.


సిగ్గుందా డీజీపీ?: చంద్రబాబు
‘‘దాడుల అనంతరం ఒక సీఐ అనుమానాస్పదంగా వచ్చాడు. ప్రెస్ మీట్‌లో అందరికీ చూపించాం. ఆ తర్వాత పోలీసులను పిలిచి ఆయన్ను వారికి అప్పజెప్పాం. ఫిర్యాదు కూడా చేశాం. అలాంటిది మాపైనే వారు తిరిగి ఫిర్యాదు చేసి, మాపై హత్యాయత్నం కేసు పెడతారా? సిగ్గుందా డీజీపీ? ఇంతటి మహా వ్యవస్థకు నాంది పలికారు ఈ డీజీపీ? చూస్తా నీ కథ? ఏం చేస్తావు? పట్టాభి ఇల్లును కూడా ధ్వంసం చేశారు. ఆయన్ను అరెస్టు చేస్తారా?’’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 


‘సీఎంలు తప్పు చేస్తారు.. కానీ మరీ ఇలా కాదు’
‘‘ఈ రాష్ట్రం మొత్తాన్ని భ్రష్టు పట్టించారు. ఈ రాష్ట్రం ఏమవుతుందా? అని అనిపిస్తుంది. నేను చాలా ముఖ్యమంత్రులను, అధికారులను చూశా. చాలా మంది తప్పులు చేస్తారు. కానీ వారు మళ్లీ సరిదిద్దుకునే తప్పులు చేస్తారు. కానీ, ఈ ముఖ్యమంత్రి జగన్ డబ్బుపై వ్యామోహంతో రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క ఏపీలోనే 25 వేల ఎకరాల్లో 8 వేల కోట్ల రూపాయలు విలువచేసే గంజాయి పంట పండుతోంది. ఎక్కడికక్కడ దేశం మొత్తం పంపిణీ చేస్తే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.’’ అని చంద్రబాబు ఆరోపించారు.


Also Read: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..  ప్రత్యేక దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే? 


మేం ప్రజల కోసం ప్రాణాలిస్తాం
‘‘కేసులకు భయపడే పార్టీ తెలుగు దేశం పార్టీ కాదు.. ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలు త్యాగం చేసే పార్టీ తెలుగు దేశం పార్టీ. ప్రజా స్వామ్యం అపహాస్యం చేసి 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను బర్తరఫ్ చేస్తే ప్రాణాలు లెక్కచేయకుండా నడిరోడ్డుపైకి వచ్చి మళ్లీ 30 రోజుల్లో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర తెలుగు దేశం పార్టీది. అలాంటి పార్టీని పట్టుకొని అసహాస్యం చేస్తారా? అప్పుడు డీజీపీ పిల్లోడిగా ఉండి ఉంటారు. సర్వీసులోకి వస్తానని కూడా అనుకొని ఉండరు. నాకు కథలు, నీతులు నేర్పిస్తావా? నువ్వు. ఈ ముఖ్యమంత్రి కూడా గోళీలు ఆడుకొని ఉండి ఉంటారు. ఇప్పుడు అధికారం వచ్చేసరికి అహంకారం ప్రదర్శిస్తారా?’’ అని చంద్రబాబు అన్నారు.


Also Read: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్.. తలుపులు బద్దలుకొట్టి మరీ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు..


డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడండి.. మేమూ సహకరిస్తాం
‘‘గంజాయి, డ్రగ్స్ వాడుతున్న, సరఫరా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపండి. అందుకు ప్రభుత్వానికి మేం కూడా సహకరిస్తాం. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడేవారిపై ఇలాంటి చర్యలకు మీరు పాల్పడితే చరిత్ర హీనులుగా మారిపోతారు గుర్తుంచుకోండి’’ అని చంద్రబాబు హెచ్చరించారు. అందుకే ప్రభుత్వాన్ని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్నానని చంద్రబాబు చెప్పారు. దీనిపై పోరాడేందుకే ఈ రోజు దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ‘‘కొంత మంది దాడి చేస్తే మనం భయపడిపోతామని అనుకుంటున్నారు. మొన్న కూడా రఘురామక్రిష్ణం రాజును పోలీసులు బాగా కొట్టి.. తర్వాత రోజు మెజిస్ట్రేటు దగ్గరికి తీసుకెళ్లారు.’’ అని చంద్రబాబు అన్నారు.



‘‘ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారమంతా తెలుగు దేశం పార్టీకి, వైఎస్ఆర్ సీపీకి మధ్య జరుగుతున్న ఉద్రిక్తత అని ప్రజలు అనుకుంటున్నారు. కానేకాదు. ప్రజల సమస్యలపై పోరాడే వ్యవస్థ రాజకీయ పార్టీలు. అందులో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ. ప్రజా సమస్యలపైనే ఇప్పుడు మేం పోరాడుతున్నాం.’’-


Also Read: నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ? 


Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 21 Oct 2021 10:18 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.