రోజులుగా సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. లోబో రీ ఎంట్రీ చూసి రవి , సన్నీ, ఆనీ, శ్రీరామ్ పరిగెత్తుకు వచ్చి హగ్ చేసుకున్నారు. మరోవైపు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ '"బంగారు కోడిపెట్ట" హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టేస్తోంది. ప్రభావతి అనే కోడి పెట్ట ఇచ్చే ఎగ్స్ మాట దేవుడెరుగు కానీ హౌస్ మేట్స్ మధ్య మినీ యుద్ధమే జరుగుతోంది. ఇప్పటికే ప్రియ-సన్నీ మధ్య పెద్ద గొడవ జరిగింది. ప్రియ-కాజల్ కూడా కస్సుబుస్సు మన్నారు.  మరోవైపు జస్వంత్ కి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసేందుకు సిరి సహాయం తీసుకున్నాడు. ఎవరైనా ముగ్గురు ఇంటి సభ్యుల దగ్గర గుడ్లు లేకుండా నాశనం చేయాలి. రౌండ్ ముగిసేరికి ఆ ముగ్గురి దగ్గరా ఎగ్స్ లేకుండా చూసుకుంటే కెప్టెన్సీ పోటీదారుడు అవొచ్చనే ఆఫర్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా  ప్రియ, ప్రియాంక, షణ్ముక్ దగ్గర ఎగ్స్ లేకుండా చూసుకుంటానని బిగ్ బాస్ కు చెప్పాడు జస్వంత్. ఆ దిశగా సిరి ప్రయత్నాలు చేసింది కూడా...అవెంత వరకూ సక్సెస్ అయ్యాయో ఇంకా క్లారిటీ లేదుకానీ ఈ సీక్రెట్ టాస్క్ మాత్రం జస్సీ-సిరి-షన్ను మధ్య చిచ్చు పెట్టేసింది. నీకు సీక్రెట్ టాస్క్ ఇవ్వడం నువ్వు సిరి హెల్ప్ తీసుకోవడం మధ్యలో నన్ను యదవని చేయడం అని ఫీలైపోయాడు షణ్ముక్. మరోవైపు టాస్క్ సరిగా ఆడు అనే యదవ డైలాగ్స్ వినాల్సి వచ్చిందన్నాడు. ఫ్రెండ్ అని ఫీలయ్యాను కాబట్టే సిరి చెబుతుండగా...అందుకే ఇలా చేశారని ఏడ్చాడు షణ్ముక్. జెస్సీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా షణ్ముక్ పట్టించుకోలేదు. ఫ్రెండ్ మాటలకి ఫీలైన సిరి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. 






మొత్తానికి ఈ రోజుతో కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ పూర్తై కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ప్రస్తుతానికి కెప్టెన్ గా విశ్వ ఉండగా...మరి ఏడో వారం బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్ అయ్యేదెవరో చూడాలి.
Also Read:  అనారోగ్యం వల్ల కొద్దిసేపే చూస్తానన్న ఉప రాష్ట్రపతి ..సినిమా మొత్తం అయ్యేవరకూ కదల్లేదట
Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?
Alos Read: తమన్నా ఔట్-అనసూయ ఇన్..హాట్ యాంకర్ అంతకుమించి అనిపిస్తుందా..!
Also Read: 'ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్', సాయి ధరమ్ తేజ్ పై హరీశ్ శంకర్ ట్వీట్ వైరల్
Also Read: రెచ్చిపోయిన ప్రియ..ఇచ్చి పడేసిన సన్నీ… హౌస్ లోకి లోబో రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
Also Read: సూపర్ స్టార్ మహేశ్ బాబు బిజినెస్ పెంచిన సాయిపల్లవి...
Also Read: వైవా హర్ష పెళ్లిలో సెలబ్రెటీల సందడి...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి