టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికీ వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. ఈడా ఉంటా ఆడా ఉంటూ వెండి తెరతో పాటూ బుల్లితెరపైనా అడుగుపెట్టింది.  ఓ  ఛానెల్లో ‘మాస్టర్ చెఫ్’ అనే వంటల పోటీ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. కొద్ది రోజులుగా ప్రసారమవుతున్న ఈ షో ద్వారా మిల్కీకి మంచి పేరే వచ్చింది.  ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన షో రాను రాను తమ్మూ హోస్టింగ్ పై ప్రశంసలు కురిశాయి...వారాంతంలో బాగానే నడుస్తోంది. అయితే త్వరలో తమన్నా ప్లేస్ ని హాట్ యాంకర్ అనసూయ తో భర్తీ చేయనున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా కన్ఫామ్ చేసింది ఆ చానెల్... 





కొద్ది రోజుల్లో ‘మాస్టర్ చెఫ్’ సీజన్ 1 ముగియబోతోంది. అయితే తమన్నా ఇచ్చిన డేట్స్ ను నిర్వాహకులు సరిగా వినియోగించుకోలేకపోయారట. పైగా ఆమెకి సినిమా కమిట్ మెంట్స్ ఉండడంతో ఈ ప్రోగ్రామ్ కి డేట్స్ కేటాయించలేకపోతోందట. దీంతో నిర్వాహకులు అనసూయను రంగంలోకి దించారని టాక్.  అప్పుడే అనసూయ ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఫస్ట్ సీజన్ లోని మిగిలిన ఎపిసోడ్స్ కి అనసూయ హోస్ట్ చేయనుందని...ఫైనల్ ఎపిసోడ్స్ తో మళ్ళీ తమన్నా కనిపిస్తుందని టాక్. ఇక ఈ షో కోసం అనసూయ భారీ పారితోషికం అందుకుంటోందని టాక్ .


Also Read: సూపర్ స్టార్ మహేశ్ బాబు బిజినెస్ పెంచిన సాయిపల్లవి...
తమన్నా ప్రస్తుతం  వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్  “ఎఫ్3” కోసం బల్క్ డేట్స్ కేటాయించింది. హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో షూటింగ్ జరుగుతోంది. కెరీర్ క్లోజ్ అనుకున్న సమయంలో మరింత వేగం పెంచిన తమన్నా సీనియర్ హీరోలతో నటించేందుకు సై అంటే ఆపర్లు, భారీ పారితోషికం అందుతుందని భావిస్తోందట. ఇందులో భాగంగా సీనియర్ హీరోలతో నటించేందుకు సై అంటోందట తమ్మూ. వెంకీతో F3 లో నటిస్తోన్న మిల్కీ...చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్లో రానున్న  "భోళా శంకర్" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సైరా లో చిరుతో కలసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే ఈ సారి ఫుల్ లెంగ్త్ రోల్ చేసేందుకు భోళా శంకర్ సినిమాకి కమిటైంది. ఏదేమైనా పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో వెలుగుతూనే ఉంది మిల్కీ.  మరోవైపు అనసూయ ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోస్ తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు తమన్నా ప్లేస్ ని మాత్రమే కాదు హోస్టింగ్ స్టైల్లోనూ అంతకుమించి అనిపిస్తుందేమో చూడాలి.
Also Read: 'ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్', సాయి ధరమ్ తేజ్ పై హరీశ్ శంకర్ ట్వీట్ వైరల్
Also Read: రెచ్చిపోయిన ప్రియ..ఇచ్చి పడేసిన సన్నీ… హౌస్ లోకి లోబో రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
Also Read: చిన్నారి ప్రాణం కాపాడిన సోనుసూద్.. నిజంగా దేవుడే!
Also Read: నాగబాబు గొప్ప నటుడేమీ కాదు.. చిరు, పవన్ లేకపోతే..: కోట శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి