కమెడియన్ వైవా హర్ష వివాహం ఘనంగా జరిగింది. బుధవారం హైదరాబాద్ లో హర్ష వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ  వివాహానికి చిత్ర పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్ కె ఎన్ తో పాటు కమెడియన్ ప్రవీణ్ పెళ్ళిలో సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు హర్షతో దిగిన ఫొటోను షేర్ చేసిన దర్శకుడు మారుతి...   హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. గాడ్ బ్లెస్ యు .. అంటూ విషెష్ తెలియజేశారు. 






యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన హర్ష... ఒక్క వీడియోతో సూపర్ పాప్యులర్ అయ్యాడు. 'వైవా' కాన్సెప్ట్ తో విడుదలైన షార్ట్ ఫిల్మ్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. దానితో హర్ష కాస్త వైవా హర్ష అయ్యాడు.  2014లో విడుదలైన మై నే ప్యార్ కియా చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు హర్ష. 2020లో విడుదలైన కలర్ ఫోటోలో వైవా హ‌ర్ష కీల‌క పాత్ర‌లో నటించాడు. అందులో హ‌ర్ష న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లొచ్చాయి. అప్పటి నుంచి హర్షకు ఆఫర్ల జోరు పెరిగింది.  ప్ర‌స్తుతం ఆహాలో ఓ టాక్ షోకు వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న హ‌ర్ష‌.. సందీప్ కిష‌న్ నిర్మాణంలో  వివాహ భోజ‌నంబు, స‌త్య‌దేవ్ తిమ్మ‌ర‌సులో కీల‌క పాత్ర‌లు పోషించాడు. హర్ష ఖాతాలో మరికొన్ని ఆఫర్లున్నాయి. 


ఇక అక్షర తనకు నాలుగేళ్లుగా తెలుసని చెప్పిన హర్ష... స్నేహంగా మొదలైన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు ఏడడుగుల వేశామన్నాడు. తన తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పిన వెంటనే అంగీకరించారు కానీ అక్షర తండ్రి పెళ్లికి అంగీకరించడానికి కొంత సమయం తీసుకున్నారని చెప్పాడు.
Also Read: తమన్నా ఔట్-అనసూయ ఇన్..హాట్ యాంకర్ అంతకుమించి అనిపిస్తుందా..!
Also Read: 'ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్', సాయి ధరమ్ తేజ్ పై హరీశ్ శంకర్ ట్వీట్ వైరల్
Also Read: రెచ్చిపోయిన ప్రియ..ఇచ్చి పడేసిన సన్నీ… హౌస్ లోకి లోబో రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
Also Read: నాగబాబు గొప్ప నటుడేమీ కాదు.. చిరు, పవన్ లేకపోతే..: కోట శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి