నటి, క్లాసికల్‌ డాన్సర్‌ అయిన సుధా చంద్రన్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.  తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బోజ్‌పూరి, మరాఠి ఇలా అన్ని భాషల్లో నటించారు. సినిమాలతో పాటూ సీరియల్స్ లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  క్లాసికల్ డాన్సర్ అయిన సుధా చంద్రన్ భరతనాట్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నో షోస్ నిర్వహించారు. కొన్ని షో స్ కి జడ్జిగా ఉన్నారు. 'మయూరి' సినిమాతో జాతీయఅవార్డుని, నంది పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఇప్పడామె గురించి చర్చ ఎందుకంటే ఎయిర్‌పోర్ట్ లో అధికారుల వల్ల తమకి ఎదురవుతున్న ఇబ్బందులను చెబుతూ ఆమె నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు ఓ స్పెషల్‌ కార్డ్ జారీ చేయాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్‌ చేసి.. అది ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. 






ఏం జరిగిందంటే.. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన సుధా చంద్రన్ కృత్రిమ పాదాన్ని అమర్చుకుని డాన్సర్‌గా ఎన్నో షోలు నిర్వహించారు. ఇప్పటికీ డాన్స్‌ షోలతోపాటు నటిగానూ రాణిస్తున్నారు. అయితే కృత్రిమ అవయవం ధరించి ఎయిర్‌పోర్ట్ కి వెళ్లినప్పుడు తనకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెకింగ్‌ కోసమని ప్రతిసారి ఆ కృత్రిమ పాదాన్ని తీయాల్సి వస్తోందని... అధికారులు ఆ విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలిపారు.  ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. కృత్రిమ అవయవంతో డాన్సు చేసి చరిత్ర సృష్టించిన నేను ఈ దేశం గురించి గర్వపడుతున్నాను.  అయితే నా ప్రొఫేషనల్ విజిట్‌లకు వెళ్లిన ప్రతిసారీ విమానాశ్రయాల్లోనే నన్ను ఆపేస్తున్నారు. దయజేసి నా కృత్రిమ అవయవం కోసం ఈటీడీ (ఎక్స్ ప్లోసివ్‌ ట్రేస్‌ డిటెక్టీవ్‌) చేయమని సెక్యూరిటీ వద్ద అభ్యర్థించినప్పటికీ వాళ్లు నాన్నుప్రతిసారి ఆ అవయవాన్ని తీసేయాలని  కోరుతున్నారు. దయజేసి సీనియర్‌ సిటిజన్లకి `సీనియర్‌ సిటిజన్` అని చెప్పే కార్డ్ ఇవ్వండి` అని అభ్యర్థించారు సుధా చంద్రన్‌. మరి సుధా అభ్యర్థనకు ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి..
Also Read:  అఘోరాగా యువ హీరో...‘గామి’టీమ్‌కు బన్నీ ప్రశంసలు
Also Read: 'హెడ్స్ అండ్ టేల్స్' సమీక్ష: సీరియస్ ఇష్యూకు సొల్యూషన్ అంత ఈజీనా?
Also Read: దీన్నే వాడుకోవడమంటారు.. సిరిని తిడుతూ ఏడ్చేసిన షణ్ముఖ్..
Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి