ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం గతంలో ఏపీ ఈఏపీసెట్-2021 ను నిర్వహించారు. దీనికి సంబంధించి అడ్మిషన్ల కౌన్సిలింగ్ అక్టోబర్ 25 నుంచి ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గురువారం ఆయన విజయవాడలో కౌన్సెలింగ్ షెడ్యుల్ ను విడుదల చేశారు.  కాగా ఆన్ లైన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. అలాగే నవంబర్ 1 నుంచి 5 వరకు విద్యార్థుల వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు కూడా నవంబర్ 10న జరుగుతుందని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. నవంబర్ 15 నుంచి తరగదులు ప్రారంభం అవుతాయని తెలిపింది. 


వెబ్ కౌన్సెలింగ్ కు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ఆన్ లైన్ జరుగుతుందని, ఏవైనా ఆటంకాలు ఎదురైతే 25 వరకు హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అడ్మిషన్ల వెబ్‌ కౌన్సెలింగ్‌ వివరాల కోసం https:// sche. ap. gov. in చూడొచ్చని మంత్రి తెలిపారు. 


మొత్తం ఎన్ని సీట్లంటే?
రాష్ట్రంలో 409 కళాశాలల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఫార్మాడి కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు మొత్తం 1,39,862 సీట్లు ఉన్నాయని మంత్రి తెలియజేశారు. అయితే వీటిలో యూనివర్సిటీ గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే అడ్మిషన్లు అనుమతిస్తున్నట్టు చెప్పారాయన. ఇలా చూసుకుంటే 409లో 337 కళాశాలలకు మాత్రమే అఫ్లియేషన్ ప్రక్రియ పూర్తయింది. అంటే సీట్లు కూడా తగ్గే పరిస్థితి ఉంది. అఫ్లియేషన్ పూర్తయిన కళాశాలల్లో 81,597మాత్రమే సీట్లు ఉన్నాయి. మిగతా కళాశాలలు తమ బకాయిలను వర్సిటీలకు చెల్లిస్తే వాటిలోని సీట్లను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. 
విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలున్నా "convenerapeapcet 2021@ gmail.com' కు లేదా 8106876345, 8106575234, 7995865456 నెంబర్లకు ఫోన్ వివరాలు అడిగి తెలుసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. 


Also Read: సీబీఎస్‌ఈ బోర్డు కీలక ప్రకటన.. ఎగ్జామ్ సెంటర్ మార్పునకు ఓకే! 
Also Read: దివ్యాంగ విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50 వేలు సాయం..


Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం ... చెబుతున్న కొత్త అధ్యయనం


Also read: రోజుకు ఓ నాలుగు వాల్నట్స్ తిన్నా చాలు... జ్ఞాపకశక్తి పెరుగుతుంది


Also read: బిస్కెట్లు, కేకులు అధికంగా తింటే... ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం, తేల్చిన కొత్త అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి