వాల్‌నట్స్‌ను చూస్తే మీకు మెదడే గుర్తొస్తుంది. వాటి రూపం మానవ మెదడునే పోలి ఉంటుంది. వీటినే ఆక్రోట్స్ అని కూడా పిలుస్తారు. పోషకాహారాల్లో వాల్ నట్స్ ముందుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోజూ తినాల్సిన ఆహారపదార్థాలివి. ముఖ్యంగా మెదడు పనితీరును మెరుగుపరచయడంలో వీటిని మించిన ప్రత్యామ్నాయమే లేదు. వీటి వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మెదడు కణాలను నాశనం కాకుండా కాపాడడంలో ఇవి ముందుంటాయి. అందుకే చదువుకునే పిల్లలకు రోజూ కనీసం నాలుగు వాల్ నట్స్ అయినా తినిపించడం చాలా మంచిది. 


1. ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాలోకి వచ్చే పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండెకు రక్షణ పెరుగుతుంది. 
2. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. ఇవి మానసిక ఆరోగ్యంపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. డిప్రెషన్, ఒత్తిడి బారిన పడినవారికి ఇవి మేలు చేస్తాయి. 
3. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, బి6, కాపర్, సెలీనియం, మాంగనీస్ మొదలైన పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. 
4. డయాబెటిస్ తో బాధపడేవాళ్లు రోజూ నాలుగు నట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. 
5. వివిధ రకాల క్యాన్సర్ల నుంచి కూడా ఇవి కాపాడతాయి. రొమ్ము క్యాన్సర్, పేగుల క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. వీటిలో పాలిఫెనాల్ ఎలాగిటానిన్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ల బారి నుంచి రక్షిస్తాయి. 
6. గర్భణిలకు ఇవి ఎంతో మంచివి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుట్టబోయే పిల్లల మెదడుపై ప్రభావం చూపిస్తాయి. బిడ్డ మెదడు ఎదుగుదలకు సహకరిస్తాయి. 
7. ఎదుగుతున్న పిల్లలకు వీటిని రోజూ తినిపించడం చాలా మంచిది. ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. ఇందులో ఉండే ఆల్భాలినోలెనిక్ ఆమ్లం ఇలా ఎముకలను బలంగా మారుస్తుంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: బిస్కెట్లు, కేకులు అధికంగా తింటే... ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం, తేల్చిన కొత్త అధ్యయనం


Also read: గోళ్లకు వచ్చే అరుదైన క్యాన్సర్... చెక్ చేసుకోవడం ఇలా


Also read: ఎట్టకేలకు డెంగూ జ్వరానికి ఔషధం... కనిపెట్టిన లక్నో శాస్త్రవేత్తలు


Also read: కొరియన్ అమ్మాయిలు సన్నగా, మెరుపుతీగల్లా ఎలా ఉంటారు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి