ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలు, నేతలపై జరిగిన దాడులకు నిరసన ఆ పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. సీఎం జగన్ పై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టింది. ఈ ఘటనలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవరిస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఆయనను అసభ్యపదజాలంతో దూషిస్తే ఆ పార్టీ నేతల ఊరుకుంటారా అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పట్టాభి సీఎం జగన్ పై అనుచితవ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ జనాగ్రహ దీక్షలో సజ్జల పాల్గొన్నారు.
Also Read: పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు
టీడీపీవి దొంగ దీక్షలు
ఈ కార్యక్రమంలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న దీక్షలు చూస్తే నవ్వాలో ఏడ్వాలో ఆ పార్టీ వాళ్లకే అర్థం కావడం లేదన్నారు. టీడీపీ దీక్షలకు పట్టుమని పది మంది రావడంలేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ సంయమనం పాటించాలని శ్రేణులకు చెప్పారని, అందుకే వైసీపీ కార్యకర్తలు సహనంగా ఉన్నారన్నారు. తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడరని ఈ విషయం టీడీపీ గమనించాలని సజ్జల అన్నారు.
పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడంలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని దూషించడం సరికాదన్నారు. టీడీపీ నేతలు పనిగట్టుకుని ఎన్నిసార్లు దూషించినా వైసీపీ నేతలు మౌనంగానే ఉన్నామన్నారు. ప్రజలకు మంచి చేయాలని చూస్తే అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు వినేందుకు ఇబ్బంది బూతులు మాట్లాడుతూ.. దొంగ దీక్షలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.
Also Read: సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్‌మీట్ డీటైల్స్ ఇవిగో..
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే...
టీడీపీ డీఎన్‌ఏలోనే లోపం ఉందన్న సజ్జల.. చంద్రబాబును చూస్తే జాలేస్తుందన్నారు. పట్టాభితో చంద్రబాబే బూతులు మాట్లాడించారని ఆరోపించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకుంటే ఇలాంటి ఘటనలే భవిష్యత్తులో ఎదురవుతాయని తేల్చిచెప్పారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సజ్జల తెలిపారు. అయితే టీడీపీ నేతలు కూడా దిల్లీకి వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామంటున్నాయి.
Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!