ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసు అమర వీరు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత పట్టాభి తనను బూతులు తిట్టారని ఓ పదం గురించి ప్రస్తావించారు. ఆ పదానికి అర్థం ఏమిటో కూడా విడమరిచి చెప్పారు. అది పత్రికా ప్రమాణాల ప్రకారం.. రాయలేని.. వినిపించలేని పదం. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలా తిట్టారని చెప్పారు. తన తల్లిని అంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై రకరకాల స్పందనలు అటు రాజకీయాల్లో ఇటు నెటిజన్లలోనూ వస్తున్నాయి. 


Also Read : దాడుల్లో డీజీపీ పాత్ర - సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్ !


అయితే పట్టాభి ఆ పదాన్ని వాడింది పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించే కానీ ముఖ్యమంత్రిని కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిని తాడేపల్లిలోని పబ్జిదొరగా అభివర్ణించారని గుర్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది.  సజ్జల రామకృష్ణారెడ్డిని పట్టాభి అలా మాట్లాడితే సీఎం జగన్ తననే అన్నారని తన తల్లిని కూడా రాజకీయ వివాదాల్లోకి తెస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. 


Also Read : పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు


పట్టాభి మాట్లాడిన పూర్తి ప్రెస్‌మీట్‌ వీడియో లింక్‌ను కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఆ ప్రెస్‌మీట్ చూస్తే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎంను తిట్టారో లేదో తెలిసి పోతుందని అంటున్నారు. 



Also Read: నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ? 


మరో వైపు ముఖ్యమంత్రినే తిట్టారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపించారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేశానికి గురయ్యారన్నారు. ముందు ముందు ఇలా తిడితే దాడులు జరుగుతాయని కూడా హెచ్చరించారు. అదే సమయంలో పట్టాభి తిట్టారంటూ ఆయనపై కేసులు కూడా నమోదు చేసి బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాలతో.. ఈ ఘటన కేంద్రంగా రాజకీయం మరింత కాలం సాగే అవకాశం కనిపిస్తోంది. 


 Also Watch : https://www.youtube.com/watch?v=1bdSCKXqBm0&t=343s


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి