ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన అనంతరం ఓ కేంద్ర మంత్రి సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రామప్ప ఆలయ సందర్శనలో భాగంగా ఆయన వెంట రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క ఇతర నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ తల్లి ప్రాంగణానికి చేరుకొని గట్టమ్మతల్లికి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గట్టమ్మ టెంపుల్ దగ్గరలో నూతనంగా నిర్మించిన "హరిత గ్రాండ్ హోటల్ & కాటేజ్" లను కిషన్ రెడ్డి ప్రారంభించారు.


ఇక్కడ నుంచి వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయానికి చేరుకొని రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప దేవాలయం శిల్పకళ నైపుణ్యాన్ని గైడ్ ద్వారా మంత్రులు తెలుసుకున్నారు. అలాగే రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ శిలాఫలకం ఆవిష్కరణ, ప్రజా మౌలిక సదుపాయాలను కేంద్ర మంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. వారి వెంట టూరిజం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు ఉన్నారు.


Also Read: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..  ప్రత్యేక దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే? 






















ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి