క్యాన్సర్లలో దాదాపు 200 రకాలను గుర్తించారు వైద్యులు. అందులో ఒకటి నెయిల్ క్యాన్సర్. దీన్నే శాస్త్రీయంగా సబుంగల్ మెలనోమా అని పిలుస్తారు. ఇది చాలా అరుదుగా వస్తుంది. దీన్ని గుర్తించడం కూడా చాలా కష్టం. గోళ్లు కూడా మన ఆరోగ్యాన్ని సూచించడంలో ముందుంటాయి. చర్మక్యాన్సర్ సూర్యరశ్మి తగిలే చేతులు, కాళ్లపైనే కాదు, పాదాల కింద, గోళ్లపై, అరచేతులతో కూడా వస్తుంది. గోళ్ల విషయంలో అయితే చుట్టూ ముద్దగా, లేదా గోరు కింద పుండులా అవుతుంది.
ఎందుకు వస్తాయి?
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ చర్మ క్యాన్సర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని చెబుతోంది. ముఖ్యంగా కనిపెట్టడం కష్టంగా మారే గోళ్ల క్యాన్సర్ ను కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని హెచ్చరిస్తోంది. మొదటి స్టేజ్లో మెలనోమా క్యాన్సర్ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, అలాగే గోళ్లను కూడా చేస్తుంది. కాబట్టి గోళ్ల క్యాన్సర్ ముందే పసిగడితే చికిత్స అందించడం, కోలుకోవడం కూడా సులువుగా మారుతుంది. ఈ మెలనోమా క్యాన్సర్లు అతినీలలోహిత కిరణాల వల్ల కలుగుతాయని బ్రిటన్ కు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ తెలిపింది.
చెక్ చేసుకోవడం ఎలా?
1. నిత్యం గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకోకండి. గోళ్లలో జరుగుతున్న మార్పును కనిపెట్టాలంటే అవి సహజంగా ఉండాలి. కాలి బొటన వేలు, చేతివేళ్లపై కాస్త ముదురు రంగులో గీతల్లాంటివి, చుక్కల్లాంటివి కనిపిస్తే వాటిని పట్టించుకోకుండా వదిలేయకండి.
2. గోరు చుట్టూ ఉన్న చర్మాన్ని పరిశీలించండి. ఆ చర్మం ముదురు రంగులోకి మారినప్పుడు అది మెలనోమాకు సంకేతం కావచ్చు.
3. ఎలాంటి గాయాలు లేకుండానే గోరు వేలి నుంచి విడిపోయి పైకి లేస్తుంది.
4. గోరు చిట్లిపోయినట్టు అవుతుంది. గోరు మధ్యలో గీతలా ఏర్పడుతుంది.
5. గోర్ల కింద చిన్నపుండులా మారచ్చు. గోరుపై నల్లటి గుండ్రటి ఆకారం ఏర్పడవచ్చు. అది సన్నగా ఉండొచ్చు లేదా బొడిపెలా కూడా ఉండొచ్చు.
ఇలాంటి లక్షణాలు గోళ్లలో కనిపిస్తే, అది కూడా రోజుల కొద్దీ వెంటాడుతుంటూ కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఎట్టకేలకు డెంగూ జ్వరానికి ఔషధం... కనిపెట్టిన లక్నో శాస్త్రవేత్తలు
Also read: గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?
Also read: మగవారికి గట్టి షాకిచ్చిన జైపూర్ రెస్టారెంట్... ఇప్పుడు ఎలా తింటారో చూద్దాం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి