ఏపీలో కొనసాగుతున్న బంద్, ఉద్రిక్త పరిణామాలపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారా లోకేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగా సంచలన ప్రకటన చేశారు. మంగళవారం టీడీపీ ఆఫీసుపై దుండగుల దాడి అనంతరం అక్కడికి సీఐ నాయక్‌ రాగా.. ఆయనపై నారా లోకేశ్ సహా పలువురు దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లుగా డీజీపీ ప్రకటించారు. ఈ కేసులో ఏ1గా లోకేశ్ పేరు, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్‌, ఏ5గా పోతినేని శ్రీనివాసరావుపై కేసు పెట్టినట్లు చెప్పారు. హత్యాయత్నంతో పాటు వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు వెల్లడించారు. 


Also Read: నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ?


చంద్రబాబు ఫోన్ ఎత్తా.. వినపడట్లేదని కట్ చేశా
అంతేకాకుండా టీడీపీ నాయకుడు పట్టాభిరాం అసభ్య వ్యాఖ్యలు చేశారని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొట్టిపారేశారు. చంద్రబాబు ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తలేదన్న విమర్శలపై కూడా గౌతం సవాంగ్ స్పందించారు. ఆయన తెలియని నెంబరు నుంచి ఫోన్ చేశారని, ఆ సమయంలో పరేడ్‌లో ఉన్నానని అన్నారు. కాల్ ఎత్తినా బ్యాంక్ గ్రౌండ్‌కు వినిపించలేదని చెప్పారు. తర్వాత మాట్లాడతానని తాను ఫోన్ కట్ చేసినట్లుగా సమర్థించుకున్నారు.


ఈ సందర్భంగా డీజీపీ కరోనా సమయంలో పోలీసులు చేసిన సేవలను కొనియాడారు. కొవిడ్ సమయంలో సమాజ సేవ చేసిన పోలీసులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సవాలు ఉన్న సమయంలో కూడా ఎంతో మంది పోలీసులు, మహిళా పోలీసులు తమ ఉద్యోగాన్ని, బాధ్యతను నిబద్ధతతోనే నిర్వర్తించారని అన్నారు. 206 మంది పోలీసులు కరోనా సోకవడం వల్ల చనిపోయారని అన్నారు.


Also Read:  ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు


ప్రెస్ మీట్‌లో సీఐ నాయక్
అయితే, టీడీపీ నాయకులు దాడి చేశారని భావిస్తున్న సీఐ నాయక్.. మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కనిపించారు. అయితే, ఆయనకు ఎలాంటి గాయాలు అయినట్లు కనిపించలేదు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి.






Also Read: Jagan Reaction : బూతులు వినలేక .. అభిమానించే వాళ్లకు బీపీ వచ్చి రియాక్టయ్యారు : జగన్


Also Read: ఆవేశంలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది.. కాన్వాయ్ తీసేసి తిరుగుతా, లోకేశ్ దమ్ముంటే రా.. మంత్రి అనిల్ సవాల్


Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులను ఖండించిన పవన్ కల్యాణ్... ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి