ఇంట్లో ఆడవాళ్లను వదిలేసి రెస్టారెంట్లకు చెక్కేసే మగమహరాజులకు జైపూర్ లోని ఓ రెస్టారెంట్ గట్టి షాకే ఇచ్చింది. తమ రెస్టారెంట్లకు కచ్చితంగా మహిళలతో కలిసే రావాలని షరతు పెట్టింది. పురుషుల మాత్రమే వస్తే అనుమతించబోమని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ రెస్టరెంట్ వివరాలు ట్విట్టర్ లో ట్రెండవుతున్నాయి. ఈ హోటల్ పేరు ‘గోపి పవిత్ర భోజనాలయ’. జైపూర్ నడిబొడ్డులో ఉన్న ఈ రెస్టారెంట్ కు మంచి పేరే ఉంది. ఆహారం, రుచిగా, శుచిగా ఉంటుందని చెప్పుకుంటారు జైపూర్ జనాలు. అయితే ఈ హోటల్ వారు హఠాత్తుగా ఓ బ్యానర్ ను తమ హోటల్ వెలుపల, లోపల కట్టారు. అందులో ‘మహిళలతో కలిసి వస్తేనే లోపలికి అనుమతించబడును’ అని రాశారు. ఈ బ్యానర్ ను ఓ ట్విట్టర్ యూజర్ ఫోటో తీసి పోస్టు చేయడంలో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ ట్వీట్ ను దాదాపు వేయిమంది దాకా రీ ట్వీట్ చేశారు. వేల మంది లైకులు కొట్టారు. ‘తాగుబోతులు, రౌడీలను దూరంగా పెట్టడానికి ఇది మంచి ఆలోచన’ ఒక నెటిజన్ కామెంట్ చేయగా, మరొక బ్రహ్మచారి ‘అన్ని రెస్టారెంట్లు ఇదే పద్దతి పాటిస్తే నాలాంటి వాళ్లు ఆకలితో మాడి చస్తారు’ అని కామెంట్ చేశారు. మరొకరు ‘డేటింగ్ లో భాగంగా అమ్మాయిని తీసుకొని ఈ రెస్టారెంట్ కు వెళ్లొచ్చా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రెస్టారెంట్ వాళ్లకే నష్టమని భావించే వాళ్లూ ఉన్నారు. ఎక్కువగా బయట తినేది మగవాళ్లేనని, ఆడవాళ్లు ఇంటి ఆహారానికే ప్రాధాన్యనిస్తారని అంటున్నారు. కానీ రెస్టారెంట్ వాళ్లు మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు.
Also read: గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?
Also read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు
Also read: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి
Also read: ఇరవై, ముఫ్పైలలోనే బట్టతల? కారణాలు ఇవే కావచ్చు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి