పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్‌లు, పరీక్షలు, చికిత్స అందడానికి ఓ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శ్రీకారం చుట్టింది. కరోనా బాధితులకు ఓ కోర్సు యాంటీవైరల్ డ్రగ్స్ 10 డాలర్లకే అందేలా డబ్ల్యూహెచ్ఓ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
మెర్క్ అండ్ కో (ఎమ్ఆర్‌కే.ఎన్) ప్రయోగాత్మక డ్రగ్స్ పిల్స్‌ను కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉన్నవారికి ఈ కార్యక్రమంలో భాగంగా అందించనున్నారు. ఈ మేరకు రైటర్స్ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద దేశాలకు మొత్తం ఒక బిలియన్ కొవిడ్-19 టెస్టింగ్ కిట్స్ పంపేందుకు డబ్ల్యూహెచ్ఓ సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్ల రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన డ్రగ్స్‌ను సిద్ధం చేస్తోంది. రాబోయే 12 నెలల్లో 200 మిలియన్ల కొవిడ్ కేసులు వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది.
అయితే ఇవి ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉన్నట్లు రైటర్స్ పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నెల చివరిలో జరగనున్న జీ-20 సదస్సు కంటే ముందే దీన్ని జీ-20 దేశాల ముందు పెట్టే అవకాశం ఉంది.
తాజా హెచ్చరికలు..
కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దని పేర్కొంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మధ్యలోనే ఉన్నామని హెచ్చరించింది. కొందరు కొవిడ్ ముగిసిపోయిందని అనుకుంటున్నారని.. ఇది చాలా ప్రమాదకరమని తెలిపింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదంది.
Also Read: UP Assembly Election 2022: 'ఓ మహిళా మేలుకో.. అభివృద్ధిని కోరుకో.. 40 శాతం టికెట్లు మహిళలకే'
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!