UP Assembly Election 2022: 'ఓ మహిళా మేలుకో.. అభివృద్ధిని కోరుకో.. 40 శాతం టికెట్లు మహిళలకే'

ABP Desam Updated at: 19 Oct 2021 04:42 PM (IST)
Edited By: Murali Krishna

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో 40 శాతం టికెట్లు మహిళలకే కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మహిళలు రాజకీయాల్లో చురుగ్గా ఉండాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లు మహిళలకే: ప్రియాంక

NEXT PREV

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ 40 శాతం టికెట్లు మహిళలకే ఇస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ మేరకు ప్రకటించారు.






తమ కుటుంబ సంక్షేమం కోసం మహిళలు స్వయంగా అభివృద్ధి బాధ్యత తీసుకోవాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో మహిళలు చురుగ్గా పాల్గొనాలన్నారు. 'నేను మహిళలు, నేను పోరాడగలను' అనే నినాదాన్ని ప్రియాంక ఇచ్చారు. మహిళలు మార్పును కోరుకుంటే తమతో కలిసిరావాలని సమాజంలో లింగ సమానత్వాన్ని చాటాలన్నారు. 


భాజపాపై మాటల తూటాలు..


కేంద్రం తీసుకువచ్చిన ఉజ్వల యోజనపై ప్రియాంక గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు వందశాతం పాల్గొంటారని ఆకాంక్షించారు. కేవలం 2000 రూపాయలకు వంట గ్యాస్ ఇచ్చి మహిళలును ఉద్ధరిస్తున్నట్లు కొందరు అనుకుంటారని ప్రియాంక అన్నారు.



ఎన్నికల్లో మహిళలకు 40 శాతం సీట్లు కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఉన్నావ్, హథ్రాస్ బాధితులే కారణం. నేను లఖింపుర్ ఖేరీ వెళ్లినప్పుడు అక్కడ ఓ బాలిక తాను ప్రధాని కావాలని కోరుకుంటున్నానని నాకు చెప్పింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆమె కూడా ఓ కారణం. ఉత్తర్‌ప్రదేశ్‌ను అన్ని రకాల ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్న ప్రతి మహిళ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం.                                        - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి


Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 19 Oct 2021 04:33 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.