ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా యాదాద్రికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి క్యాన్వాయ్‌లో ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ ఈవో సహా అధికారులు, జిల్లా అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. తొలుత సీఎం కేసీఆర్ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ప‌లువురు నాయ‌కుల‌ను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం ఆలయ పరిసరాలు మొత్తం కలయ తిరిగారు. ఈ సందర్భంగా అధికారులు సీఎంకు అన్ని వివరాలు చెప్పారు. 


Also Read: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ 


తొలుత సీఎం కేసీఆర్ హెలికాప్టర్ నుంచి ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు. ఆ త‌ర్వాత కాన్వాయ్‌లో ఘాట్ రోడ్డు ద్వారా కొండ‌పైకి చేరుకున్నారు. దాదాపు పూర్తయిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులను పరిశీలించిన అనంత‌రం ఆలయ పునఃప్రారంభ ముహూర్తం, తేదీని సీఎం ప్రకటిస్తారు. ఆలయం పునఃప్రారంభం ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్‌ స్వామి నిర్ణయించారని, యాదాద్రిలోనే సీఎం స్వయంగా ప్రకటిస్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగానే ప్రకటించనున్నారు. 


Also Read : గుర్తులతో గుబులు... దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందా..?... ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన


ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి, మండ‌లి మాజీ చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, గ్యాద‌రి కిశోర్, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, మ‌ర్రి జ‌నార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ డిజైనర్ ఆనంద్ సాయి తదితరులు ఉన్నారు.


నాలుగేళ్ల కింద యాదాద్రి పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా సీఎం కేసీఆర్ దాదాపు 15 సార్లు యాదాద్రి వెళ్లి పనులపై సమీక్ష జరిపారు. దాదాపు రూ.1800 కోట్ల అంచనా వ్యయంతో ఈ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు.


Also Read : ఈటల రాజేందర్‌కు హరీష్ రావు మరో సవాల్.. బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గులాంగిరీ.. టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు!










ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి