తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, కాసగోడ్ జిల్లాలకు  వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కేరళ, కర్నాటక, లక్షద్వీప్‌ వైపు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఇప్పటి వరకు కేరళ వ్యాప్తంగా 39 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కె. రాజన్​ తెలిపారు. మరోవైపు నేడు, రేపు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది.


వరద ఉద్ధృతి పెరగడం వల్ల అధికారులు ఇడుక్కి జలాశయం గేట్లు ఎత్తి  నీటిని కిందకు వదిలారు. వరద సహాయక చర్యలను పర్యవేక్షించాలను జిల్లా పాలనాధికారులకు ప్రభుత్వం తెలిపింది. కొండ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున.. తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పింది.
సహాయక చర్యలు చేపట్టేందుకు 12 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. వాయుసేన, నావికాదళం కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. వరద హెచ్చరికలు ఎప్పటికప్పుడు మారుతున్నాయని.. వీటిపై అనవసరమైన వార్తలను వ్యాప్తి చేయడం ప్రజలకు మంచిది కాదని వెల్లడించింది. 


వర్షాలకు పోయిన ఇళ్లు


కేరళలో వర్ష బీభత్సం ధాటికి వేలమంది నిరాశ్రయులయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో, వరదలు ముంచెత్తడంతో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఒక్క కొట్టాయం జిల్లాలోనే 62 గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముందకయం పట్టణంలో ప్రైవేటు బస్‌ డ్రైవర్‌గా పనిచేసే జేబి అనే వ్యక్తి ఇల్లు కళ్ల ముందే మణిమాల నది వరదలో కొట్టుకుపోవడం అక్కడి తాజా విలయానికి నిదర్శనం. తన 27 ఏళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారిందంటూ జేబి కన్నీరుమున్నీరయ్యారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, హరియాణా, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది.


Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం... సీఎం, డీజీపీలకు తెలిసే దాడులు జరిగాయి... చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ
Also Read: ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి