రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల  ప్రజలు ఆవేశాలకు  గురికావద్దు.. సంయనం పాటించాలని డీజీపీ కార్యాలయం పిలుపునిచ్చింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన  వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని.. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిది. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని.. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో  సంయనం పాటిస్తూ సహకరించాలని కోరారు. 


Also Read : ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు


టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజలు వచ్చి దాడి చేశారని డీజీపీ కార్యాలయం  చెబుతోది. రాష్ట్ర డీజీపీ కార్యాలయం పక్కనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. పదుల సంఖ్యలో కార్లలో కర్రలు, రాడ్లతో దుండగులు వచ్చి దాడులు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అంత సేపు దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని టీడీపీ అధినేతచంద్రబాబు చెప్పారు.


Also Read: ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..! అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !


తెలుగుదేశం పార్టీ నేతలు ప్రధానంగా పోలీసులపైనే ఆరోపణలు చేస్తున్నారు. శాంతిభద్రతలను వదిలేసి రాజకీయ పార్టీ కోసం పని చేస్తున్నారని..  రాష్ట్రంలో అరాచకాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంలోనే విధ్వంసం జరిగిందంటే నేరగాళ్లకు ఎలా భయం లేకుండా పోయిందో తెలుస్తుందని అంటున్నారు.


Watch: విమర్శలు చేస్తే దాడులు చేస్తారా.. ప్రభుత్వంపై అచ్చెన్న సీరియస్‌


రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు ప్రయత్నాలు జరిగాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీ, సీఎం కుమ్మక్కయి దాడులు చేయిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. నేరుగా టీడీపీ ఆఫీసు మీద దాడి చేసినా పోలీసులు నింపాదిగా స్పందించడం..  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగానే దాడి చేశారని చెప్పడంపై టీడీపీ నేతలు మండి పడుతున్నారు. 


Also Read: టీడీపీ కార్యాలయాలపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి