భారత్ లో 13,23,702 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,623 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 19,446 మంది కోలుకున్నారు. 197 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 3.41 కోట్లకు చేరింది. అందులో 3.34 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 4,52,651 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,78,098కి తగ్గింది. క్రియాశీల రేటు 0.52 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.15 శాతానికి చేరింది.


ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 3,42,986 మందికి వైరస్ సోకింది. కొవిడ్​​ ధాటికి మరో 4,921 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,18,70,992 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,20,294 కు పెరిగింది.


అమెరికాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 71,809 మందికి వైరస్​ సోకింది. మరో 1,563 మంది వైరస్​​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్​లో కిందటి రోజుతో పోల్చుకుంటే కొవిడ్​ కేసులు కాస్త పెరిగాయి. కొత్తగా 43,738 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 223 మృతి చెందారు. టర్కీలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఒక్కరోజే 30,862 మందికి వైరస్​ బారిన పడ్డారు. 223 మంది మరణించారు.


కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దని పేర్కొంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మధ్యలోనే ఉన్నామని హెచ్చరించింది. కొందరు కొవిడ్ ముగిసిపోయిందని అనుకుంటున్నారని.. ఇది చాలా ప్రమాదకరమని తెలిపింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదంది.


" కరోనా కాలం మొదలై దాదాపు రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని చోట్ల ఐసీయూలు, ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా ముగిసిందని నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. "
                                                                               -ప్రపంచ ఆరోగ్య సంస్థ


Also Read: WHO on Covid Vaccines: పేద దేశాలకు కరోనా టీకాలు చేరేలా డబ్ల్యూహెచ్ఓ పక్కా స్కెచ్!