ఈరోజు ఎపిసోడ్ లో కాజల్ దాచుకున్న ఎగ్స్ ను రవి సహాయంతో సిరి దొంగిలించే ప్రయత్నం చేసింది. ఆ తరువాత షణ్ముఖ్ తో ప్రియా డిస్కషన్ పెట్టింది. కాజల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఎప్పుడూ అనిపించలేదా..? అని షణ్ముఖ్ ని ప్రశ్నించింది ప్రియా. తన ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇలా ఆడితే బావుంటుందని చెప్తుంటుంది కానీ అది తప్పు అని చెప్పాడు షణ్ముఖ్. ఆ తరువాత కోడికూత వినిపించడంతో ఇంటి సభ్యులంతా ఎగ్స్ కోసం పోటీపడ్డారు. ఈ గ్యాప్ లో కాజల్ ఎగ్స్ కొన్నింటిని సిరి కొట్టేసింది.
బిగ్ బాస్ ఛాలెంజ్..
ఈ ఛాలెంజ్ లో మానస్, మానస్ ఎన్నుకునే హౌస్ మేట్ స్పైసీ నూడుల్స్ బౌల్ మొత్తం తినాల్సి ఉంటుంది. ఏ పోటీదారులలైతే ముందుగా మొత్తం బౌల్ ని కంప్లీట్ చేస్తారో వాళ్లకు ఐదు గుడ్లను ఎక్ట్రాగా ఇస్తానని చెప్పారు బిగ్ బాస్. దీనికోసం మానస్.. సన్నీను ఎంపిక చేసుకోగా.. ఫైనల్ గా సన్నీ గెలిచి ఎక్స్ట్రా ఎగ్స్ ను గెలుచుకున్నాడు.
ఫైనల్ గా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ 'బంగారు కోడిపెట్ట' టాస్క్ కు ఫుల్ స్టాప్ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో అందరికంటే ఎక్కువ ఎగ్స్ మానస్, విశ్వ, శ్రీరామ్, రవి, సన్నీ సంపాదించారు. ఈ టాస్క్ లో జెస్సీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీక్రెట్ టాస్క్ ను సరిగ్గా అర్ధం చేసుకోవడంలో, అమలు చేయడంలో జెస్సీ విఫలమవ్వడంతో అతడిని కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం మానస్, విశ్వ, శ్రీరామ్, రవి, సన్నీలు పోటీ పడబోతున్నట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు.
కొన్ని రోజులుగా సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. లోబో రీ ఎంట్రీ చూసి రవి, సన్నీ, ఆనీ, శ్రీరామ్ పరిగెత్తుకు వచ్చి హగ్ చేసుకున్నారు.
ఇక సీక్రెట్ టాస్క్ మాత్రం జెస్సీ-సిరి-షన్ను మధ్య చిచ్చు పెట్టేసింది. నీకు సీక్రెట్ టాస్క్ ఇవ్వడం నువ్వు సిరి హెల్ప్ తీసుకోవడం మధ్యలో నన్ను ఎదవని చేయడం అని ఫీలైపోయాడు షణ్ముక్. మరోవైపు టాస్క్ సరిగా ఆడు అనే ఎదవ డైలాగ్స్ వినాల్సి వచ్చిందన్నాడు. ఫ్రెండ్ అని ఫీలయ్యాను కాబట్టే అని సిరి చెబుతుండగా... అందుకే ఇలా చేశారని ఏడ్చాడు షణ్ముక్. జెస్సీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా షణ్ముక్ పట్టించుకోలేదు. 'మీరే కెప్టెన్ లు అవ్వండి, కెప్టెన్సీ పోటీదారులవ్వండి. నా గురించి పట్టించుకోవద్దు. మీరు టాస్క్ బాగానే ఆడారు. నాకే ఆడడం రాలేదు' అంటూ ఎమోషనల్ అయ్యాడు షణ్ముఖ్. 'దీన్నే వాడుకోవడం అంటారు' అంటూ సిరిపై మండిపడ్డాడు. ఫ్రెండ్ మాటలకి ఫీలైన సిరి కూడా కన్నీళ్లు పెట్టుకుంది.
హౌస్ లోకి పంపించిన లోబోకి రెండు ఎగ్స్ ఇచ్చి పంపించారు బిగ్ బాస్. ఒకటి గోల్డెన్ ఎగ్ కాగా.. మరొకటి బ్లాక్ ఎగ్. లోబో తన దగ్గరున్న గోల్డెన్ ఎగ్ ను ఎవరికైతే ఇస్తాడో.. వారు నేరుగా కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి అర్హులవుతారు. ఎవరికైతే బ్లాక్ ఎగ్ ఇస్తాడో వారు అనర్హులవుతారు. ఈ ఎగ్స్ ను పట్టుకొని లోబో కాసేపు హౌస్ మేట్స్ ని ఏడిపించాడు. ఫైనల్ గా శ్రీరామ్ కి బ్లాక్ ఎగ్, కాజల్ కి గోల్డెన్ ఎగ్ ఇచ్చాడు లోబో.
అనంతరం రవి, యానీ, శ్రీరామ్, విశ్వ అర్ధరాత్రి లోబోతో మీటింగ్ పెట్టారు. అందరూ గ్రూపులుగా ఆడుతున్నారని యానీ.. లోబోకి చెబుతుండగా.. 'మనం కూడా ఆడొచ్చు.. కానీ నువ్ అటు ఇటు జంప్ అవుతుంటావ్' అంటూ యానీకి కౌంటర్ ఇచ్చాడు.
ఇక ఉదయాన్నే షణ్ముఖ్-సిరి డిస్కషన్ పెట్టుకున్నారు. 'నువ్ చాలా తప్పుగా అర్ధం చేసుకున్నావ్ షన్ను' అని సిరి అనగా.. 'నాకు నీలాగా నటించడం రాదు సిరి' అంటూ కామెంట్ చేశాడు. ఏదీ కావాలని చేయలేదని సిరి చెప్తుండగా.. షణ్ముఖ్ వినలేదు. 'నన్ను సున్నాలో పెట్టి నేను ఈ హౌస్ కి పనికిరానని నా ఫ్రెండ్సే ప్రూవ్ చేశారు' అంటూ షణ్ముఖ్ ఫైర్ అయ్యాడు. 'మీ ఇద్దరి మీద నాకు రెస్పెక్ట్ పోయింది.. నువ్ వాడి కోసం గేమ్ ఆడావ్' అంటూ షణ్ముఖ్ మాట్లాడడంతో సిరికి కోపం వచ్చి రూమ్ లోపలకి వెళ్లిపోయింది.
ఆ తరువాత డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని తింటుండగా.. నేను కూడా జాయిన్ అవ్వొచ్చా అంటూ ప్రియా చైర్ పట్టుకొని వచ్చి కూర్చుంది. అక్కడే సన్నీ కూడా ఉండడంతో.. 'సన్నీ కెప్టెన్ అయితే నేను రేషన్ మ్యానేజర్ అవుతా.. అప్పుడైన సచ్చినట్లు మాట్లాడాలిగా..' అంటూ నవ్వించింది. ఆ వెంటనే 'నేను ఎవరి ప్లేట్ లో తింటున్నా..?' అంటూ సన్నీ ప్లేట్ చూపించింది. అది చూసిన హౌస్ మేట్స్ 'సన్నీ.. నీ ప్లేట్ లో తింటున్నారు ప్రియా గారు' అని చెప్పగా.. సన్నీ సిగ్గుపడుతూ నవ్వేశాడు.
కోపంగా ఉన్న షణ్ముఖ్ కి కాఫీ తీసుకెళ్లి ఇచ్చింది సిరి. కానీ కాఫీ తాగకుండా అక్కడనుంచి లేచి వెళ్లిపోయాడు షణ్ముఖ్. లంచ్ విషయంలో కూడా అలానే చేయడంతో.. రవి కలుగజేసుకొని ఫుడ్ పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ తనకు మూడ్ లేదని పంపించేశాడు.
Also Read: బిగ్ బాస్ హౌస్ లోకి లోబో రీ-ఎంట్రీ ..యదవనయ్యా అన్న షణ్ముక్-కన్నీళ్లు పెట్టుకున్న సిరి…!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి