ABP  WhatsApp

CBSE Exam Centre Change: సీబీఎస్‌ఈ బోర్డు కీలక ప్రకటన.. ఎగ్జామ్ సెంటర్ మార్పునకు ఓకే!

ABP Desam Updated at: 10 Apr 2022 10:31 AM (IST)
Edited By: Murali Krishna

సీబీఎస్​ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.

సీబీఎస్ఈ విద్యార్థులకు కీలక ప్రకటన

NEXT PREV

సీబీఎస్‌ఈ బోర్డు.. విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 10, 12వ తరగతి పరీక్షల ఎగ్జామ్ సెంటర్ల విషయంలో విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది. అడ్మిషన్ తీసుకున్న నగరాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే వీలు కల్పిస్తున్నట్లు బోర్డు తెలిపింది. 



పరీక్ష కేంద్రం మార్పుపై విద్యార్థులకు త్వరలో సూచనలు జారీ చేస్తాం. విద్యార్థులు, పాఠశాలలు సీబీఎస్​ఈ వెబ్​సైట్​ను తరచూ చూస్తూ ఉండాలి. ప్రకటన వెలువడగానే పరీక్షా కేంద్రం మార్పుపై విద్యార్థులు తమ పాఠశాలలకు అభ్యర్థన చేసుకోవాలి.షెడ్యూల్ టైమ్ దాటిన తర్వాత పరీక్ష కేంద్రం మార్పును అనుమతించం.                                         -     సీబీఎస్‌ఈ బోర్డు


10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ బోర్డు పరీక్షల షెడ్యూల్​ను ఇటీవల విడుదల చేసింది సెంట్రోల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ). 10వ తరగతి పరీక్షలు నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 వ తరగతి పరీక్షలు డిసెంబర్​ 1 నుంచి జరగనున్నాయని ప్రకటించింది. అయితే ఈ షెడ్యూల్ మేజర్ సబ్జెక్టులకు మాత్రమేనని సీబీఎస్​ఈ ఎగ్జామ్​ కంట్రోలర్​ సన్యమ్ భరద్వాజ్ తెలిపారు. మైనర్ సబ్జెక్టులకు సంబంధించిన టైం టైబుల్​ను పాఠశాలలకు ప్రత్యేకంగా పంపిస్తామన్నారు. నవంబర్​ 16న పదో తరగతి, నవంబర్​ 17న 12వ తరగతి మైనర్ సబ్జెక్టుల పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.


కరోనా కారణంగా 2021-22 విద్యాసంవత్సరానికి మార్పులు చేసింది సీబీఎస్​ఈ. విద్యా సంవత్సరాన్ని రెండుగా విభజించి రెండు టర్మ్-ఎండ్​ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే సిలబస్​లోనూ మార్పులు చేసింది.10, 12వ తరగతి ఫస్ట్​ టర్మ్​ పరీక్షలు ఆఫ్​లైన్​లోనే నిర్వహిస్తామని సీబీఎస్​ఈ స్పష్టం చేసింది. 90 నిమిషాల నిడివి గల ఈ పరీక్షలు ఆబ్జెక్టివ్​ విధానంలో ఉండనున్నాయి.


Also Read: Priyanka Gandhi Detained: నేను రాష్ట్రంలో తిరగకూడదా? రెస్టారెంట్లో కూర్చోవాలా?: ప్రియాంక గాంధీ


Also Read: Lakhimpur Kheri Case: ఎందుకింత ఆలస్యం..? దీన్నొక అంతులేని కథగా మార్చకండి: సుప్రీం


Also Read: Aryan Khan Bail News: ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 20 Oct 2021 06:54 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.