కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని.. ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆగ్రాలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబాన్ని కలవడానికి వెళ్తున్న ప్రియాంకను మార్గ మధ్యంలో పోలీసులు నిలిపివేశారు.
అంతకుముందు ప్రియాంక గాంధీని లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఉన్న మొదటి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే ప్రియాంక గాంధీని అడ్డుకోవడంపై కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణ పడినట్లు సమాచారం. అయితే తనను అదుపులోకి తీసుకోవడంపై ప్రియాంక గాంధీ.. యూపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
దొంగతనం ఆరోపణలు..
ఆగ్రాలో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడు రూ.25 లక్షలు దొంగతనం చేసినట్లు అభియోగాలు వచ్చాయి. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసి, తన ఇంటి వద్ద తనిఖీ చేశారు. ఆ సమయంలో నిందితుడి హఠాత్తుగా కింద పడిపోయాడని.. ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు ఆగ్రా ఎస్పీ తెలిపారు.
Also Read: Lakhimpur Kheri Case: ఎందుకింత ఆలస్యం..? దీన్నొక అంతులేని కథగా మార్చకండి: సుప్రీం
Also Read: Aryan Khan Bail News: ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి