గోదావరి తీరంలోని మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో హెలికాఫ్టర్ నిఘా కలకలం రేపుతోంది. ఓ వైపు మావోయిస్టుల కీలక నాయకుడు హిడ్మా వైద్యం కోసం సరిహద్దు అటవీ ప్రాంతాలకు వచ్చారన్న ప్రచారంతో ఆయన కోసమే హెలికాఫ్టర్ నిఘాను ఏర్పాటు చేశారని భావిస్తున్నారు.  హిడ్మా ఏటూరునాగారం సమీప అడవుల్లోకి వచ్చారని పోలీసు వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. దీంతో అక్కడ నిఘాను పెంచారు. 


Also Read : "హిడ్మా" టార్గెట్‌గా భారీ ఆపరేషన్ .. వైద్యం కూడా అందకుండా కట్టడి !
 
పీఎల్‌జీఏ కమాండర్అయిన హిడ్మా తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి వచ్చినట్లుగా ఖచ్చితమైన సమాచారం పోలీసులకు వచ్చింది. గోదావరి పరివాహకం ఉన్న 8 మండలాల పరిధిలో.. తుపాకులగూడెం అడవుల్లో దట్టమైన గుట్టలు, వాగులు ఉన్న ప్రాంతాల్లో హిడ్మా మకాం వేసినట్లుగా భావిస్తున్నారు. అందుకే పోలీసు కమెండోలు అడవులకు చేరుకుని దిగ్బంధం చేశారు. ఫలితంగా ఏటూరునాగారం మొత్తం అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. 


Also Read : ఆర్కే స్థానంలో సుధాకర్ ? ఏవోబీలో పట్టు జారకుండా మావోయిస్టుల పక్కా వ్యహం !


ఆపరేషన్ హిడ్మాను ప్రత్యేకంగా ఓ ఉన్నతాధికారి పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. హిడ్మా అడవుల్లో ఎక్కడ మకాం వేశాడనే అంశంపై కూపీలాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  ఇంటలిజెన్స్‌కు చెందిన ప్రత్యేక ఉన్నతాధికారి కూడా గట్టుచప్పుడు కాకుండా సాధారణ దుస్తుల్లో ఏజెన్సీలో తిరుగుతూ సమాచారం సేకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో మకాం వేసినట్లుగా తెలుస్తోంది.  కంటికి కనిపించని డ్రోన్ కెమెరాలతో నిఘానేత్రంతో అడవులు  అడవులు జల్లెడపడుతున్నారు. 


Also Read : మన సరిహద్దులకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా... అనారోగ్యమా? అగ్ర నేత మృతిపై ఆరా తీసేందుకా...?


హిడ్మా అనారోగ్యంోత  బాధపడుతున్నారు. వైద్యం కోసం వచ్చారు.  ఆయన హోదా ప్రకారం కనీసం పాతిక మంది సాయుధులైన మావోయిస్టులు భద్రత కల్పిస్తారు. నాలుగంచెల భద్రత ఉంటుంది. ఈ భద్రత నడుమే సురక్షిత ప్రాంతానికి హిడ్మా ఎప్పటికప్పుడు తరలి వెళ్తున్నట్లుగా భావిస్తున్నారు. గోదావరి తీరంలోని అడవుల్లో ఉండే గిరిజనలు ఎంతటి రహస్యాన్ని అయినా బయట పెట్టరు. గుత్తికోయకు చెందిన హిడ్మా అంటే వారికి అభిమానం ఉంటుంది. హిడ్మా గురించి సమాచారం అసలు చెప్పరు.  దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న గుత్తి కోయ గూడేల చుట్టూ సీసీ కెమెరాలను పోలీసులు అమర్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read : మావోయిస్టు నేత ఆర్కే మరణం ప్రభుత్వ హత్యే... మావోయిస్టుల ఆహారంలో విషం కలుపుతున్నారు... ఆర్కే భార్య శిరీష ఆరోపణ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి